close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఓజోనిట్‌తో వైరస్‌ ఖతం!

వరంగల్‌ నిట్‌లో సరికొత్త పరికరం ఆవిష్కరణ

నిట్‌క్యాంపస్‌, న్యూస్‌టుడే: చూడగానే రిఫ్రిజిరేటర్‌లా కనిపిస్తోంది కదూ ఇది. కానీ ఇదో సరికొత్త పరికరం.  కరోనా నివారణ కోసం వరంగల్‌ నిట్‌లో దీనిని రూపొందించారు. పండ్లు, కూరగాయలు, సెల్‌ఫోన్లు, నగదు, నగల లాంటి వాటిని ఇందులో ఉంచి ఓజోన్‌ వాయువును ఉత్పత్తి చేసే ఓ మీట నొక్కితే 20 నిమిషాల్లో వాటిపై ఉన్న అన్ని రకాల ఫంగై, వైరస్‌లు, బ్యాక్టీరియాలు 99.99 శాతం తుడిచిపెట్టుకుపోయి పరిశుభ్రమవుతాయట. ఇలా పరిశుభ్రం చేశాక ఓజోన్‌ వాయువు లీక్‌ కాకుండా దానంతట అదే బయటకు వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారిని ఖతం చేసే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో నిట్‌ భౌతిక శాస్త్ర విభాగం ఈ అద్భుత ఆవిష్కరణ చేసింది. ఈ బహుళార్థక స్టెరిలైజేషన్‌ పరికరానికి ఓజోనిట్‌ అని పేరుపెట్టారు. నిట్‌ భౌతిక శాస్త్ర విభాగం అధిపతి ఆచార్య డి.దినకర్‌ సహకారంతో సహ ఆచార్యులు డాక్టర్‌ డి.హరనాథ్‌, పరిశోధక విద్యార్థి పి.చందర్‌రావు సంయుక్తంగా దీనిని రూపొందించారు.


  యు.వి. కిరణాలకంటే ఈ విధానం మేలు

అతి నీలలోహిత (యు.వి) కిరణాల ప్రయోగం కంటే ఓజోన్‌ వాయువును ఉపయోగించే ఈ విధానం ఎంతో మేలైనది. దీని ద్వారా వస్తువులు వైరస్‌ రహితమవుతాయి. యు.వి కిరణాలు వాడినప్పుడు వస్తువుల నీడ పడి పూర్తిగా శుభ్రం కావు. కానీ ఓజోన్‌ అన్ని మూలలకు వ్యాపించి వైరస్‌, బ్యాక్టీరియాలను హతమారుస్తుంది. ఇలా శుభ్రం చేసిన కూరగాయలు, పండ్లను మంచి నీటిలో కడిగి వాడుకోవచ్చు. రుచి, నాణ్యతలో ఎలాంటి మార్పు ఉండదు. ఇలాంటి పరికరం ప్రతి ఇంట్లో ఉండాలని మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. దీనిని త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేసి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తాం.    

     -నిట్‌ డైరెక్టర్‌ ఆచార్య ఎన్‌.వి.రమణారావు


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు