భవిష్యత్తులో చేతి చమురు వదలకుండా..! - ev startups want govt to focus on gst reform demand push affordability
close

Published : 29/01/2021 22:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భవిష్యత్తులో చేతి చమురు వదలకుండా..!

 విద్యుత్తు వాహనాలకు ప్రోత్సాహకాలు అవసరం

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ 2019-20లో దిగుమతి చేసుకొన్న చమురు విలువ 101 బిలియన్‌ డాలర్లు. ఇది చాలా దేశాల జీడీపీ కంటే ఎక్కువ. అంటే వచ్చే పదేళ్లలో తక్కువలో తక్కువ ట్రిలియన్‌ డాలర్ల చమురును దిగుమతి చేసుకొంటాము. అసలే అంతంత మాత్రంగా ఉన్న మన ఆర్థిక వ్యవస్థపై ఇది పెనుభారంగా మారుతుంది. అందుకే ప్రభుత్వం 2030 నాటికి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని సగానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొంది. 2022 నాటికి చమురుపై ఆధారపడటాన్ని 10శాతం తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొంది. అంటే.. భారత్‌లో కొత్తగా చమురు నిల్వలైనా బయటపడాలి.. లేదంటే ప్రత్యామ్నాయాలకు సిద్ధం కావాలి. భారత్‌ చమురుపై ఆధారపడటం తగ్గాలంటే వాహన రంగంలో పెనుమార్పులు రావాలి. 

భారత్‌లో మూడోవంతు కుటుంబాలు ద్విచక్ర వాహనాలు వినియోగిస్తున్నాయి. వాహనాల నుంచి వెలువడే ఉద్గారాల్లో దాదాపు 75శాతం వాటా వీటిదే. అందుకే ప్రభుత్వం తొలుత ద్విచక్ర వాహనాలను విద్యుత్తు వైపు మళ్లించేందుకు వీలుగా ‘ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్ వెహికల్స్‌’ (ఎఫ్‌ఏఎంఈ) పాలసీని ప్రవేశపెట్టింది. దీని కింద రాయితీలను అందజేస్తోంది. కానీ, ప్రస్తుతం ఇది అనుకున్నంత వేగంగా లేదు. విద్యుత్తు వాహనాల ధరలు ఎక్కువగా ఉండటం.. ఛార్జింగ్‌ స్టేషన్ల కొరత ప్రధాన కారణంగా నిలిచాయి.  దీంతోపాటు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 62 పట్టణాల్లో 2,636 ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకొంది. కానీ ఇది దేశంలో విద్యుత్తు వాహనాల వాతవరణం ఏర్పాటుకు చాలా దూరంలో ఉంది. 

పట్టణ ప్రాంతాల్లో సరకులు డెలివరీ చేసేవారికి ఈ బైక్స్‌ మంచి ఆప్షన్‌గా నిలిచాయి. భారత్‌లో ఈ బైక్స్‌లో సృజనాత్మక మార్పులు చోటు చేసుకొంటున్నాయి. యాసిడ్‌ బ్యాటరీల స్థానంలో నికిల్‌ కాడ్మియం, లిథియం ఐయాన్‌ బ్యాటరీలు అందుబాటులోకి వస్తున్నాయి. కాకపోతే వీటి ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. 

మంచి భవిష్యత్తు..

ఇక 2019-20లో మొత్తం 3.8లక్షల విద్యుత్తు వాహనాలు విక్రయించారు. వీటిల్లో ద్విచక్ర వాహనాలు అత్యధిక విక్రయాలను సాధించాయి.  భారత్‌లో కాంపౌండ్‌ యాన్యూవల్‌ గ్రోత్‌ రేట్‌ 44శాతం చొప్పున 2020-27 నాటికి వార్షిక విక్రయాలు 6.34 మిలియన్లకు చేరవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో 2021-22 బడ్జెట్‌లో ప్రభుత్వం విద్యుత్తు వాహనాల స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఈ సారి మరిన్ని పథకాలను పార్లమెంట్‌ ముందుకు తీసుకురావచ్చు. 

* ప్రస్తుతం విద్యుత్తు వాహనాలపై 5శాతం జీఎస్‌టీ మాత్రమే విధిస్తున్నారు. ఇది వాహన కొనుగోలుదార్లను ఆకర్షిస్తోంది. కానీ, ఒరిజనల్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానిఫ్రాక్చర్‌ లు కొనుగోలు చేసే ముడిపదార్థాలకు 18శాతం నుంచి 28శాతం వరకు జీఎస్‌టీ చెల్లిస్తున్నాయి.  ఇది అంతిమంగా వినియోగదారుడిపై పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీఎస్‌టీలో రాయితీలు ఇస్తే  అది అంతిమంగా ప్రభుత్వ లక్ష్యసాధనకు  ప్రయోజనకరంగా ఉంటుంది. 

* ప్రభుత్వం ఇటీవలే ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటీవ్‌ పథకాన్ని ఆటోమొబైల్‌ రంగానికి  విస్తరించింది. దీనిలో అత్యాధునిక కెమిస్ట్రీ సెల్స్‌ తయారీని కూడా కలిపింది. దేశంలో డిమాండ్‌ పెంచడానికి వ్యక్తిగత స్థాయిలో, వాణిజ్య అవసరాలకు వినియోగించేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 

* విద్యుత్తు ద్విచక్ర వాహనాలను ఎక్కువ మంది కొనుగోలు చేసేలా తేలిగ్గా ఫైనాన్సింగ్‌ లభించేలా చర్యలు తీసుకోవాలి. 

ఇవీ చదవండి

బడ్జెట్‌లో సగటు జీవి సంగతేంటో..!

చైనాతో పోరుకు ముందు..!

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని