సంక్షిప్త వార్తలు
close

Published : 19/10/2021 02:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

ఖరీదైన స్థిరాస్తి విపణి హైదరాబాద్‌
దేశంలో రెండో స్థానం

ఈనాడు, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఏడాది క్రితంతో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాల్లో 59 శాతానికి పైగా వృద్ధి కనిపించిందని స్థిరాస్తి సేవల సంస్థ ప్రాప్‌టైగర్‌ పేర్కొంది. స్థిరంగా పెరుగుతున్న ధరల నేపథ్యంలో, ముంబయి తర్వాత రెండో ఖరీదైన నివాస గృహాల విపణిగా హైదరాబాద్‌ నిలిచిందని వివరించింది. గిరాకీ, సరఫరాల కోణంలో చూస్తే హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌ పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తోందని తెలిపింది. ధరలు పెరుగుతున్నా, హైదరాబాద్‌లో ఇళ్ల కొనుగోలుపై ఆసక్తి కనిపిస్తోందని పేర్కొంది. జులై - సెప్టెంబరులో నగర వ్యాప్తంగా 7,812 ఇళ్లు/ఫ్లాట్లు అమ్ముడయినట్లు తెలిపింది. జూన్‌ త్రైమాసికంతో (3,260 ఇళ్లు) పోలిస్తే ఇది 222శాతం అధికం. అమ్ముడవ్వని యూనిట్లు 50,103 ఉన్నప్పటికీ గత 25 నెలల్లో ఇదే తక్కువ. సెప్టెంబరు త్రైమాసికంలో హైదరాబాద్‌లో 12,342 యూనిట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి.  


రుణదాతలు, వాటాదార్ల సమావేశాలకు రిలయన్స్‌ రిటైల్‌కు ఎన్‌సీఎల్‌టీ అనుమతులు

ముంబయి: ఫ్యూచర్‌ గ్రూప్‌తో రూ.24,700 కోట్ల ప్రతిపాదిత ఒప్పందానికి అనుమతుల కోసం వాటాదార్లు, రుణదాతల  సమావేశాలు నిర్వహించుకోవడానికి రిలయన్స్‌ రిటైల్‌కు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) అంగీకారం తెలిపింది. సుచిత్ర కనుపర్తి ఆధ్వర్యంలోని ఎన్‌సీఎల్‌టీ ముంబయి ధర్మాసనం ఇందుకు ఆమోదముద్ర వేసింది. అయితే ఎన్‌సీఎల్‌టీ నుంచి సవివర ఆదేశాలు వెలువడాల్సి ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని