విడాకుల వార్తలకు భూమిక చెక్‌..! - Bhumika Shares Pic With bharath
close
Published : 22/10/2020 13:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విడాకుల వార్తలకు భూమిక చెక్‌..!

శుభాకాంక్షలు తెలిపిన సెలబ్రిటీలు

హైదరాబాద్‌: నటి భూమిక.. తన భర్త భరత్‌ నుంచి విడిపోయిందంటూ వస్తోన్న వార్తలకు సదరు నటి గట్టిగానే సమాధానమిచ్చారు. సెలబ్రిటీ యోగా టీచర్‌గా పేరుపొందిన భరత్‌ ఠాకూర్‌ను 2007లో భూమిక వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల కొంతకాలంగా భూమిక.. సోషల్‌మీడియాతోపాటు బయటకూడా సింగిల్‌గానే కనిపిస్తుండటంతో ఆమె.. తన భర్త నుంచి విడాకులు తీసుకుందంటూ ప్రచారం సాగింది.

కాగా, తాజాగా సదరు అవాస్తవ ప్రచారాలపై భూమిక పరోక్షంగా స్పందించారు. భరత్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసి.. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘కొన్ని వేల మైళ్ల ప్రయాణం మొదలయ్యేది ‘ప్రేమ’ అనే ఒక్క అడుగుతో. ఈ ప్రేమ ప్రయాణంలోనే పరస్పరం అర్థం చేసుకోవడం.. ఒకరి నుంచి మరొకరు ఎన్నో విషయాలు నేర్చుకోవడం.. ముఖ్యంగా మనల్ని మనం, పరస్పరం తెలుసుకోవడం జరుగుతాయి. జీవితంలో నాకెంతో సంతోషాన్ని అందించిన నీకు కృతజ్ఞతలు. మనల్ని, మన ప్రయాణాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. పనిపట్ల నీకున్న నిబద్ధతకు నేనెంతో గర్వపడుతున్నా. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అని భూమిక ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ఆమె పోస్ట్‌ చూసి పలువురు సెలబ్రిటీలు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని