మల్టీపెక్స్‌లు వేచి చూస్తున్నాయి - Multiplexes still awaiting approval from state govts to resume operations
close
Published : 11/10/2020 23:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మల్టీపెక్స్‌లు వేచి చూస్తున్నాయి

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: అన్‌లాక్‌ సడలింపుల్లో భాగంగా మల్టీపెక్స్‌లు, సినిమా థియేటర్‌లను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కేంద్రప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుగుణంగా అక్టోబర్‌ 15 నుంచి 50శాతం సీటింగ్‌ సామర్థ్యంతో వీటిని నిర్వహించవచ్చు. అయితే, తుది నిర్ణయాన్ని కేంద్రం హోంశాఖ రాష్ట్రాలకు వదిలిపెట్టింది. దూరం(ఎడం) పాటిస్తూ మల్టీప్లెక్స్‌ సంస్థలు పీవీఆర్‌, ఐనాక్స్‌, సినీ పోలీస్‌, ముక్తా ఆర్ట్స్‌ తమ సీటింగ్‌ సామర్థ్యంలో 50శాతానికి మించకుండా అక్టోబరు 15 నుంచి కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 14 రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే థియేటర్‌లను ఓపెన్‌ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చాయని పీవీఆర్‌ సీఈవో గౌతమ్‌ దత్తా అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం థియేటర్‌లు ఓపెన్‌ చేసుకోవడానికి ఇంకా అనుమతులు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు రాగానే థియేటర్‌లను పునః ప్రారంభించడానికి తాము సిద్ధం ఉన్నామని  సినీ పోలీస్‌ ఇండియా సీఈవో దేవాంగ్‌ సంపత్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించామన్న ఆయన, అనుమతులు త్వరగా మంజూరు చేయాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని