వ్యాక్సిన్‌ ఇలా ఇస్తే ఉత్తమం.. ఆక్స్‌ఫర్డ్‌ - Two doses yield better immune response claims Oxford University
close
Published : 18/12/2020 10:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్‌ ఇలా ఇస్తే ఉత్తమం.. ఆక్స్‌ఫర్డ్‌

లండన్: తమ కొవిడ్‌ టీకా రెండు పూర్తి డోసులను ఇచ్చినప్పుడు అత్యంత మెరుగైన ఫలితాలు లభించాయని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఆస్ట్రాజెనికాతో కలిసి అభివృద్ధి చేసిన టీకాకు సంబంధించిన మధ్యంతర ప్రయోగాల చివరిదశ ఫలితాలను గురువారం  ప్రచురించింది. దీనిలో ఒక పూర్తి డోసు ఇచ్చిన అనంతరం.. బూస్టర్‌ డోసుగా సగం డోసును ఇచ్చినప్పటి కంటే పూర్తి డోసును ఇచ్చినప్పుడు అధిక సామర్థ్యం చూపిందని సంస్థ తెలిసింది. ఈ ఫేజ్‌ 1, 2 క్లినికల్‌ ట్రయల్స్‌ సందర్భంగా చేసిన ప్రయోగాల్లో.. పై  రెండు విధానాలూ ఉత్తమ ఫలితాలనే ఇచ్చినప్పటికీ, పూర్తి బూస్టర్‌ డోసు ఇచ్చినప్పుడు మెరుగైన రోగనిరోధకత లభించిందని వివరించింది.

కాగా కొవిడ్‌-19పై పోరులో ఆక్స్‌ఫర్డ్‌, రష్యాతో చేతులు కలిపింది. ఆక్స్‌ఫర్డ్‌‌, స్పుత్నిక్‌ టీకాలను కలపి క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సిద్ధమౌతున్నట్టు సమాచారం. వ్యాక్సిన్‌ సహకారంలో కొత్త అధ్యాయం మొదలైందని.. తాము చేసిన ప్రతిపాదనను ఆస్ట్రాజెనికా అంగీకరించిందని స్పుత్నిక్‌ పేర్కొంది.

ఇవీ చదవండి

హృదయాలు గెలిచి.. కొవిడ్‌ ముందు ఓడారు

కరోనా.. మిస్టరీ మూలాలపై దర్యాప్తుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని