గౌరవం లేనిచోట స్నేహం చేయం: పవన్‌ - active janasena party formation says pawan
close
Published : 14/03/2021 14:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గౌరవం లేనిచోట స్నేహం చేయం: పవన్‌

హైదరాబాద్‌: జనసేన పార్టీ నిర్మాణం చురుగ్గా జరుగుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులనుద్దేశించి పవన్‌ మాట్లాడారు. ఖమ్మం ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు బలమైన పోటీ ఇస్తారని స్పష్టం చేశారు. అణగారిన వర్గాలు, బీసీలకు రాజ్యాధికారం రావాలని ఆకాక్షించారు. తెలంగాణ నుంచే బలంగా ముందుకెళతామని పవన్‌ స్పష్టం చేశారు. పాలకులు చేస్తున్న తప్పులకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే పాలకులను, ప్రజలను వేరు చేయాలని కోరుకుంటున్నానన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కులం ప్రాతిపదికన రాజకీయాలు జరగడం దురదృష్టకరమన్నారు. సమతుల్యతతో కూడిన బహుజన విధానమే జనసేన ఆకాంక్షఅని పవన్‌ వివరించారు.  

నేతల అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా..

‘‘రాష్ట్ర విభజన సమయంలో భాజపా మద్దతు తెలిపింది. ఏపీకి మోదీ మద్దతు ఇచ్చినందుకే భాజపాతో పొత్తు పెట్టుకున్నాం. భూ సంస్కరణలు తెచ్చి పీవీ సీఎం స్థానం పోగొట్టుకున్నారు. పీవీ చితి కాలకుండా అగౌరవపరిచారు. విభజన అన్యాయంతో ఏపీ ఇప్పటికీ కొట్టుమిట్టాడుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జన సైనికులు నిలబడిన విధానం హర్షణీయం. తెలంగాణ నాయకత్వం జనసేనను అంగీకరించలేకపోతోంది. భాజపా నేతలు అవమానకరంగా మాట్లాడుతున్నారు. కేంద్రంతో సత్సంబధాలు ఉన్నాయి. తెలంగాణలో మంచి సంబంధం లేదని జనసేన నేతలు బాధపడ్డారు. తమ మనోభావాలు దెబ్బతీయొద్దని తెలంగాణ జనసైనికులు కోరారు. గౌరవం ఇవ్వకపోవడంపై జనసేన నేతలు బాధపడుతున్నారు. పీవీ కుమార్తెకు మద్దతు తెలుపుదామని జనసైనికులు స్పష్టం చేశారు. పీవీ కుమార్తెకు మద్దతు ఇవ్వాలన్న నేతల అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా. గౌరవం లేనిచోట స్నేహం చేయాలని కోరుకోవట్లేదు’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 


 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని