అలిమేలు కోసం...?
close
Published : 03/03/2020 18:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలిమేలు కోసం...?

హైదరాబాద్‌: దర్శకుడు తేజ ఇటీవలే రెండు సినిమాల్ని ప్రకటించారు. అందులో ఒకటి ‘అలిమేలుమంగ వేంకటరమణ’. గోపీచంద్‌ కథానాయకుడిగా నటిస్తారని సమాచారం. టైటిల్‌ని బట్టి కథానాయకుడు వేంకటరమణగా, కథానాయిక అలిమేలుమంగగా కనిపిస్తారని అర్థమవుతోంది. ప్రస్తుతం మంగ పాత్ర ఎంపిక కోసం కసరత్తులు జరుగుతున్నాయి.
ఇదివరకే ఓ అగ్ర తార పేరు వినిపించింది. తాజాగా ఆ పాత్ర కోసం కీర్తి సురేష్‌ని సంప్రదించినట్టు సమాచారం. త్వరలో ‘మిస్‌ ఇండియా’ చిత్రంతో రాబోతున్న ఆమె తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాలు చేస్తోంది. ఆమె మంగగా కనిపిస్తుందో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని