TS High Court: చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ - telugu news ts high court hearing chennamaneni ramesh case
close
Published : 23/09/2021 14:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS High Court: చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌పై ప్రత్యక్ష విచారణ చేపట్టాలని చెన్నమనేని తరఫు న్యాయవాది కోర్టును కోరారు. పెద్ద సంఖ్యలో దస్త్రాలు ఉన్నందున ఆన్‌లైన్‌ విచారణ కష్టంగా ఉందన్నారు. మరోవైపు అదనపు ఏజీ రామచంద్రరావు కూడా ప్రత్యక్ష విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారంటూ పిటిషనర్‌ ఆది శ్రీనివాస్‌ తరఫు న్యాయవాది ఆరోపించారు. స్టే ఉత్తర్వులు ఉన్నందున కాలం వెళ్లదీసే ఎత్తుగడలు వేస్తున్నారని వాదించారు. అనంతరం స్పందించిన హైకోర్టు.. రెండు వారాల తర్వాత ప్రత్యక్ష విచారణ చేపడతామని తెలిపింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని