Sardar: కార్తి చిత్రంలో సిమ్రాన్‌? - simran negative role in karthi sardar
close
Published : 29/06/2021 10:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sardar: కార్తి చిత్రంలో సిమ్రాన్‌?

హైదరాబాద్‌: వైవిధ్యభరిత కథలకు చిరునామాగా నిలుస్తూ.. వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు కార్తి. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. అందుకే కార్తి కథల విషయంలో తెలుగు ప్రేక్షకులను దృష్టి పెట్టుకుని ఎంచుకుంటారు. ఇప్పుడాయన కథానాయకుడిగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘సర్దార్‌’. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనుంది.

ఇప్పుడీ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నటి సిమ్రాన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. కథలో ఆమె పాత్రకి ఎంతో ప్రాధాన్యముందని, ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో కార్తి వృద్ధుడిగా.. యువకుడిగా రెండు భిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రాశీ ఖన్నా కథానాయికగా ఖరారైంది. మరో నాయికగా రజిషా విజయన్‌ కనిపించనుంది. వచ్చే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ స్వరాలందిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని