Published : 21/04/2021 05:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పిల్లల్లోనూ బయట పడుతున్న లక్షణాలు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: కరోనా లక్షణాలతో పిల్లలూ గుంటూరు సర్వజనాసుపత్రికి వస్తున్నారు. ఎక్కువ రోజులు జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలతో వచ్చిన వారికి పరీక్షలు చేస్తే కొద్దిమందికి కరోనా పాజిటివ్‌గా నమోదవుతున్నాయి. ఇలా పాజిటివ్‌ వచ్చిన ముగ్గురు చిన్నారులు ప్రస్తుతం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వీరంతా 5 నుంచి 12 ఏళ్ల లోపు వారే. వీరికోసం ప్రత్యేకంగా ఓ వార్డును కేటాయించారు. సాధారణ లక్షణాలు ఉన్నవారు మందులు ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదని వైద్యులు సూచించారు. అసాధారణ లక్షణాలు ఉన్నవారికి తగిన సమయానికి వైద్యం అందిస్తే కోలుకుంటారన్నారు. వీరంతా ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. గత ఏడాది జీజీహెచ్‌లో ఇటువంటివి ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని