గ్రంథాలయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
eenadu telugu news
Published : 21/09/2021 03:50 IST

గ్రంథాలయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు

దేవానంద్‌ ప్రమాణ స్వీకార సభలో హోంమంత్రి సుచరిత


మాట్లాడుతున్న రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: గ్రంథాలయ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టనున్నారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా బత్తుల దేవానంద్‌ సోమవారం అరండల్‌పేటలోని కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ డిజిటల్‌ లైబ్రరీలు రానున్న నేపథ్యంలో దేవానంద్‌ దీన్నొక గొప్ప బాధ్యతగా స్వీకరించి దళితుల విద్యాభ్యున్నతికి సహకరించాలని సూచించారు. దళితుల ఎదుగుదలను చూసి ఓర్వలేకనే తెదేపా నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌రావు మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలో కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే చక్కని వేదికగా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దాలన్నారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ బత్తుల దేవానంద్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనా విధానానికి అనుగుణంగానే ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, నంబూరు శంకరరావు, కిలారి వెంకటరోశయ్య, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, డీసీసీబీ ఛైర్మన్‌ సీతారామాంజనేయులు మాట్లాడారు. తొలుత కొరిటెపాడులోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి, అనంతరం లాడ్జికూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ప్రమాణ స్వీకారం అనంతరం దేవానంద్‌ను పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పీర్‌మహ్మద్‌, గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ మందపాటి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని