TS News: గద్వాల్‌కు వైద్యకళాశాల మంజూరు చేయండి.. కేంద్రమంత్రికి బండి సంజయ్‌ లేఖ 
eenadu telugu news
Updated : 29/07/2021 10:48 IST

TS News: గద్వాల్‌కు వైద్యకళాశాల మంజూరు చేయండి.. కేంద్రమంత్రికి బండి సంజయ్‌ లేఖ 

హైదరాబాద్‌: జోగులాంబ గద్వాల జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కోరారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు ఆయన లేఖ రాశారు. కళాశాల ఏర్పాటుకు సంబంధించి కావాల్సిన భూములను ఇప్పటికే సేకరించినట్లు పేర్కొన్నారు. 300 పడకల వైద్య కళాశాలను కేటాయించాలని లేఖలో సంజయ్‌ కేంద్ర మంత్రిని కోరారు.

తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లా జోగులాంబ గద్వాల్ అని.. ఈ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని కోరుతూ పలువురు ప్రతిపాదించిన విషయాన్ని బండి సంజయ్‌ గుర్తు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని