Published : 22/04/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

958 కేసులు నమోదు

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా బుధవారం 958 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. వాటితో ఇప్పటి వరకు నమోదయిన కేసులు 68,275 చేరాయి. ప్రస్తుతం 5,024 మంది చికిత్స పొందుతున్నారు. కోలుకున్నవారు 62,733 మంది ఉన్నారు. మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య 518కి చేరింది.

నేడు రెండో విడత టీకా: జిల్లా వ్యాప్తంగా మొదటి డోస్‌ కొవిడ్‌ టీకా వేయించుకున్న వారికి గురువారం రెండో డోస్‌ వేస్తున్నారని, 106 కేంద్రాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

శ్రీశైలం పీఠాధిపతికి పాజిటివ్‌

శ్రీశైలం ఆలయం: శ్రీశైల జగద్గురు పీఠాధిపతి 1008 చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామికి కరోనా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని స్థానిక పీఠాధిపతి సహాయకులు నటరాజ్‌ బుధవారం తెలిపారు. బుధవారం శ్రీశైలంలో స్థానికులకు పరీక్షలు నిర్వహించగా 71 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. ఇప్పటికి వరకూ స్థానికంగా మొత్తం 352 మందికి కరోనా సోకింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని