జోగులాంబకు పట్టువస్త్రాలు
eenadu telugu news
Published : 15/10/2021 05:29 IST

జోగులాంబకు పట్టువస్త్రాలు

పట్టువస్త్రాలను తీసుకెళ్తున్న కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు

దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు ప్రభుత్వం తరఫున అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. కలెక్టర్‌కు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి కలెక్టర్‌ పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం కుంకుమార్చన, అష్టోత్తర పూజాది కార్యక్రమాలు నిర్వహించి పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. బాల బ్రహ్మేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టతను జోగులాంబ అమ్మవారి దేవస్థానం ఛైర్మన్‌ రవి ప్రకాష్‌గౌడ్‌, ఈవో మఠం వీరేశం వివరించారు. - న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని