వాయువు ఇవ్వండి.. ఆయువు నిలపండి
Published : 09/05/2021 06:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాయువు ఇవ్వండి.. ఆయువు నిలపండి


కుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలుపుతున్న అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే : కరోనా రోగులకు ఆసుపత్రుల్లో పడకలు, ఇతర సదుపాయాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా నాయకులు శనివారం జిల్లా వ్యాప్తంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులతో దీక్షలో పాల్గొన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆసుపత్రులకు వస్తున్న కొవిడ్‌ బాధితులకు సకాలంలో ప్రాణవాయువు అందించి వారి ఆయువు నిలపాలన్నారు. ‘ఈ రోజు ఉదయం ఇద్దరు కరోనా రోగుల బంధువులు నా వద్దకు వచ్చారు. విశాఖలోని 12 ఆసుపత్రులకు ఫోన్‌ చేశా. పడకలు ఖాళీలేవన్నారు. వాస్తవం ఇలా ఉంటే.. ఐసీయూ పడకలు 141, సాధారణ పడకలు 535, ద్వితీయ శ్రేణి పడకలు 1327 విశాఖలోని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయంటూ వెబ్‌సైట్‌లో సమాచారం పొందుపరిచారు. నర్సీపట్నం ఆసుపత్రిలోనూ పడకలు ఖాళీగా ఉన్నాయని చూపారు. అడిగితే ఇక్కడి వైద్యులూ ఒక పడకా ఖాళీ లేదన్నార’ని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఇప్పుడు తాయిలాలు అందించడం కంటే.. కరోనా రోగుల ప్రాణాలు నిలిపేందుకు ఆసుపత్రుల్లో పడకలు, సదుపాయాలు పెంచాల్సిన బాధ్యతను ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గుర్తించాలని అయ్యన్న కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని