‘ఉక్కు’ పరిరక్షణే ధ్యేయం: తెదేపా
eenadu telugu news
Published : 31/07/2021 03:47 IST

‘ఉక్కు’ పరిరక్షణే ధ్యేయం: తెదేపా

నిర్వాసిత కాలనీల్లో పాదయాత్ర ప్రారంభం

పాదయాత్రలో పాల్గొన్న విశాఖ లోక్‌సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు
పల్లా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, స్థానికులు

గాజువాక, న్యూస్‌టుడే : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తెదేపా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, పరిశ్రమ పరిరక్షణే ధ్యేయంగా పోరాటాన్ని ఉద్థృతం చేస్తామని విశాఖ లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా తెదేపా విశాఖ నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉక్కు నిర్వాసిత కాలనీల్లో పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు. తొలుత పెదగంట్యాడ కూడలిలోని ఎన్టీఆర్‌, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. భూములిచ్చిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత సీఎం జగన్‌పై ఉన్నా... పట్టించుకోవడం లేదని పల్లా విమర్శించారు. అనంతరం దుర్గవానిపాలెం, ఎస్సీకాలనీ, పెదగంట్యాడ, నెల్లిముక్కు, అయ్యన్నపాలెం, సీతానగరం మీదుగా సాగిన పాదయాత్రలో ఆయనకు నిర్వాసితులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును వివరిస్తూ కరపత్రాలు పంచి పెట్టారు. గాజువాక తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌, కార్పొరేటర్లు లక్ష్మీబాయి, గంధం శ్రీనివాస్‌, పల్లా శ్రీను, జగన్‌, నగర ఉపాధ్యక్షుడు పులి వెంకటరమణారెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని