గొయ్యి తప్పించబోయి మృత్యు ఒడికి..
eenadu telugu news
Updated : 19/10/2021 04:35 IST

గొయ్యి తప్పించబోయి మృత్యు ఒడికి..


వెంకటరమణారావు (పాతచిత్రం)

గాజువాక, న్యూస్‌టుడే: అప్పుడే మార్కెట్టులో కూరగాయలు కొనుక్కుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న రైల్వే విశ్రాంత ఉద్యోగి గతకల దారి పుణ్యమాని మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ విషాధ సంఘటన గాజువాక శ్రీనగర్‌ కూడలి వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సూర్యప్రకాశ్‌, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశ్రాంత రైల్వే ఉద్యోగి జి.వెంకటరమణారావు(67) వడ్లపూడి రైల్వేక్వార్టర్స్‌ మార్గంలోని అపార్టుమెంటులో అద్దెకు ఉంటున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో మార్కెట్టు పని ముగించుకుని తిరిగి ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కూర్మన్నపాలెంలో రహదారిపై గుంతలు తప్పించే క్రమంలో పక్కకు వెళ్తుండగా ట్యాంకరు లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వెంకటరమణారావు శిరస్త్రాణం ధరించి ఉంటే ప్రాణాపాయం తప్పేదని పోలీసులు తెలిపారు. ఆయనకు భార్య విజయ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌ ఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించి లారీని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని