పోలీసుస్టేషనే పాఠశాలై..

తాజా వార్తలు

Published : 29/12/2020 20:31 IST

పోలీసుస్టేషనే పాఠశాలై..

ఔరంగాబాద్‌: శాంతిభద్రతల పరిరక్షణనే కాదు భావితరాల భవిష్యత్తును కూడా మా భుజాలపై వేసుకుంటాం అంటున్నారు ఔరంగాబాద్‌కు చెందిన పోలీసులు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోని పుండలిక్‌ నగర్‌ పోలీసుస్టేషన్‌ ప్రాంగణంలో మురికివాడకు చెందిన విద్యార్థులకు ట్యుటోరియల్స్‌ నిర్వహిస్తున్నారు. కమ్యునిటీ పోలీసింగ్‌ కార్యక్రమంలో భాగంగా సమీప ప్రాంతాల్లోని పిల్లలకు 15రోజుల పాటు ఇంగ్లీష్‌, గణితం తరగతులు నిర్వహిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. మూడు రోజులుగా ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేశామన్నారు. కరోనా కారణంగా పాఠశాలలకు వెళ్లలేని కారణంగా విద్యార్థులకు, ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే అవకాశం లేని విద్యార్థుల కోసం ఈ తరగతులు ఏర్పాటు చేశామని ఇన్‌స్పెక్టర్‌ ఘన్‌శ్యామ్‌ తెలిపారు. ఇంగ్లీష్‌, గణిత పాఠ్యాంశాలు బోధిస్తున్నామన్నారు. స్థానిక పాఠశాలలో పదవీవిరమణ చేసిన ప్రధానోపాధ్యాయుడు ఎస్పీ జవాల్కర్‌ ఈ కార్యక్రమంలో స్వచ్చందంగా పాల్గొంటున్నట్లు తెలిపారు.  పోలీస్‌స్టేషన్‌ టెర్రస్‌పైన కొవిడ్‌ నిబంధనలను అనుసరించి ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

కరోనా మృతుల్లో 70శాతం మంది పురుషులే..

కంగారూలకు అప్పుడే షాకిచ్చాడు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని