close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120071917 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => nDPFhgPVhIg [video_short_link] => nDPFhgPVhIg [created_by] => [created_date] => [modified_by] => 8924902 [modified_date] => 2020-06-04 08:09:17.00138 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 04/06/2020 08:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. పక్షంలోనే లక్ష

దేశంలో కరోనా కేసుల సంఖ్య బుధవారం నాటికి 2,07,615కి చేరింది. గత నెల 19 నాటికి కేసుల సంఖ్య 1,01,139కాగా ఈ నెల 3 నాటికి ఆ సంఖ్య రెట్టింపై 2,07,615కు చేరింది. మొదటి లక్ష కేసులకు 111 రోజులు పడితే... రెండో లక్ష కేసులు 15 రోజుల్లోనే నమోదయ్యాయి. తాజాగా 24 గంటల్లో గరిష్ఠంగా 8,909 కొత్త కేసులు బయటపడ్డాయి. వరుసగా మూడోరోజు 200కి పైగా మరణాలు నమోదయ్యాయి. కొవిడ్‌ కల్లోలం నెలకొన్న అనేక దేశాలతో పోలిస్తే మరణాల రేటు తక్కువగా ఉండటంతోపాటు రికవరీ(కోలుకుంటున్న వారి) శాతమూ పెరుగుతుండటం కొంత ఊరటనిస్తున్నా... ఇప్పుడు ప్రతిఒక్కరూ ఎంత జాగ్రత్తగా ఉంటే మహమ్మారి తీవ్రత నుంచి అంతగా బయటపడతాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పంట ధర నిర్ణయం రైతులకే

రుగాలం కష్టపడే రైతు ఇక తనకిష్టమైన ధరకు పంటను అమ్ముకునే స్వేచ్ఛ లభించనుంది. తన ఉత్పత్తికి మరెవరో ధర నిర్ణయించడంతో శ్రమకు తగ్గ ఫలానికి దూరమవుతున్న అన్నదాతకు ఆ కష్టం తీరనుంది. రైతుల సంక్షేమానికి సంబంధించి కేంద్రం బుధవారం మూడు కీలక నిర్ణయాలు తీసుకొంది. ఇందుకోసం జారీ చేసే రెండు అత్యవసర ఆదేశాలు (ఆర్డినెన్స్‌లు), ఒక చట్టసవరణ ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నెదర్లాండ్స్‌లో తెలు‘గోడు’!

పిల్లలకు సాయంగా ఉండేందుకని కొందరు.. చదువుల కోసం మరికొందరు.. కుటుంబ అవసరాలకని ఇంకొందరు.. ఇలా వివిధ కారణాలతో నెదర్లాండ్స్‌ వెళ్లిన 150 మంది తెలుగువారు లాక్‌డౌన్‌తో అక్కడే చిక్కుకుపోయారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు. వీరి బాధలపై, చేయాల్సిన ఏర్పాట్లపై నెదర్లాండ్స్‌ తెలుగు సంఘం సీఈవో గుమ్మడి పవన్‌, సంఘం తరఫున దౌత్య వ్యవహారాలు పర్యవేక్షించే శ్రీనాథ్‌ పరాంకుశంలు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌కు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ లేఖలు పంపారు. తెలుగురాష్ట్రాల్లో విమానం దిగేందుకు అనుమతులు కావాల్సి ఉంటుందని నెదర్లాండ్స్‌ తెలుగు సంఘం సభ్యుడు వెంకట్రాజు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విశాఖ గ్యాస్‌ లీకేజీ..బాధ్యులైన అధికారులపై తక్షణ చర్యలు

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించడానికి సమ్మతించిన అధికారులను గుర్తించి తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. తీసుకున్న చర్యలపై 2 నెలల్లోగా నివేదిక సమర్పించాలని నిర్దేశించింది. ముందస్తు అనుమతులు లేకుండా కార్యకలాపాలు ప్రారంభించిన ఎల్‌జీ పాలిమర్స్‌దే ఘటనకు పూర్తి బాధ్యతని స్పష్టం చేసింది. అందువల్ల ఆ సంస్థ డిపాజిట్‌ చేసిన రూ.50 కోట్లను మధ్యంతర పరిహారానికి ఉపయోగించాలంది. నిపుణుల కమిటీ ఖరారుచేసే అంతిమ పరిహారాన్నీ ఎల్‌జీ పాలిమర్సే చెల్లించాలని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఈఎన్‌టీ వైద్యులకు కొవిడ్‌-19 మార్గదర్శకాలు

చెవి, ముక్కు, గొంతు సమస్యలతో వచ్చే రోగులకు వైద్యసేవలు అందించే సమయంలో డాక్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించి బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. చెవి, ముక్కు, గొంతు సమస్యలు కొవిడ్‌-19కు సంబంధించి అధిక ముప్పు కేటగిరీలోకి వస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు టెలీకన్సల్టేషన్‌ ద్వారానే రోగులకు వైద్యసేవలు అందించడానికి ప్రయత్నించాలని స్పష్టం చేసింది. రోగిని స్వయంగా పరిశీలించాల్సిన అవసరం ఉందా? లేదా? అన్నది తొలుత టెలికన్సల్టేషన్‌ ద్వారా నిర్ధారించుకోవాలని సూచించింది. అత్యవసరమైతే ముందస్తు అపాయింట్‌మెంట్‌తో రోగిని పరీక్షించాలంది. అలా కాకుండా నేరుగా వచ్చేవారిని ప్రోత్సహించవద్దని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చైనా విమానాలకు అమెరికాలో అనుమతి నిరాకరణ

చైనాకు చెందిన విమానాలను ఈ నెల 16 నుంచి అమెరికా గగనతలంలోకి రానీయకూడదని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిర్‌ చైనా, చైనా ఈస్ట్రన్‌ ఎయిర్‌లైన్స్‌, చైనా సదరన్‌ ఎయిర్‌లైన్స్‌, షియమెన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు అనుమతి నిరాకరించనుంది. కరోనా కారణంగా ఆగిపోయిన అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌లైన్స్‌, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌లకు చైనా ప్రభుత్వం అనుమతి పునరుద్ధరించకపోవడంతో దానికి ప్రతిగా ట్రంప్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. తమ దేశానికి చెందిన ఎన్ని విమానాలకు చైనా అనుమతి ఇస్తుందో, తాము కూడా ఆ దేశానికి చెందిన అన్ని విమానాలనే ఎగరనిస్తామని అధికారులు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నిరంతరం నియంత్రిత సాగు

‘మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలి. గిరాకీ మేరకు దీనిపై వ్యవసాయ శాఖ అవసరమైన ప్రణాళికలు రూపొందించాలి. ఈ వర్షాకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వచ్చింది. ఇది ప్రతి ఏటా ప్రతి సీజన్‌లో కొనసాగాలి’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రైతు లాభం కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి చేపట్టిన ఈ ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం రైతుల సహకారంతో విజయవంతం చేయాలని కోరారు. దేశంలో, రాష్ట్రంలో ఆహార భద్రత తప్ప పోషకాహార భద్రత సాధించలేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఐటీ వ్యయాలు 8% తగ్గుతాయ్‌

కొవిడ్‌-19 మహమ్మారి ప్రభావంతో భారత్‌లో ఐటీ కంపెనీలు 2020లో చేసే వ్యయాలు 8 శాతం మేర క్షీణించి 83.5 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.6.26 లక్షల కోట్లు) పరిమితమయ్యే అవకాశం ఉందని పరిశోధన సంస్థ గార్ట్‌నర్‌ వెల్లడించింది. గడిచిన 5 ఏళ్లలో కంపెనీలు ఇలా వ్యయాలు తగ్గించుకోవడం ఇదే తొలిసారని గార్ట్‌నర్‌లోని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 2019 నవంబరులో ఇదే సంస్థ వెల్లడించిన అంచనా ప్రకారం, 2020లో ఐటీ వ్యయాలు 6.6 శాతం వృద్ధితో 94 బి.డాలర్లకు చేరతాయని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కోహ్లీని రెచ్చగొడితే ఐపీఎల్‌ ఆడనివ్వడా?

ఐపీఎల్‌ కాంట్రాక్టులు నిలుబెట్టుకోవడం కోసమే 2018-19 సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని స్లెడ్జింగ్‌ చేయలేదంటూ ఆ జట్టు మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ వ్యాఖ్యాత, ఆస్ట్రేలియాకే చెందిన మాజీ ఆటగాడు డీన్‌ జోన్స్‌ తప్పుబట్టాడు. కోహ్లి లాంటి ఆటగాళ్లను కవ్విస్తే ఎక్కువ నష్టం జరుగుతుందని.. కాబట్టి ఆ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆలోచన సరైందే అని  అతనన్నాడు. ‘‘కోహ్లి విషయంలో మా వాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారో కారణం చెబుతా. మా రోజుల్లో వివ్‌ రిచర్డ్స్‌, జావెద్‌ మియాందాద్‌, మార్టిన్‌ క్రో లాంటి ఆటగాళ్లను మేమెంత మాత్రం కవ్వించేవాళ్లం కాదు. ఎలుగుబంటిని రెచ్చగొట్టడం మంచిది కాదని మనకు తెలుసు’ అని పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సాంప్రదాయ పంటల విధానానికి భిన్నంగా అంజీర్‌ సాగు

 Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.