close

తాజా వార్తలు

ఎన్‌ఆర్‌సీ డెడ్‌లైన్‌ 2024: అమిత్‌షా

రాంచీ (ఝార్ఖండ్‌): దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) అమలు చేస్తామని చెబుతూ వస్తున్న భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తాజాగా డెడ్‌లైన్‌ ప్రకటించారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి ఎన్‌ఆర్‌సీని దేశవ్యాప్తంగా అమలు చేసి చొరబాటుదారులను గుర్తించి దేశం నుంచి పంపిస్తామని వెల్లడించారు. ఎన్‌ఆర్‌సీ కారణంగానే పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూశామని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్న వేళ.. ఎన్‌ఆర్‌సీని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని షా ప్రకటించడం గమనార్హం.

ఝార్ఖండ్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా చక్రధర్‌పూర్‌, బహరగోరాలో సోమవారం నిర్వహించిన సభల్లో పాల్గొన్న సందర్భంగా అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘2024 ఎన్నికల్లా ఎన్‌ఆర్‌సీని దేశవ్యాప్తంగా అమలు చేసి చొరబాటుదారులను గుర్తించి వారిని దేశం నుంచి పంపిచేస్తాం. వారిని పంపించొద్దని రాహుల్‌ బాబా (రాహుల్‌ గాంధీ) అంటున్నారు. పంపిస్తే ఎక్కడకు వెళతారు? ఎలా బతకుతుతారు? అని ప్రశ్నిస్తున్నారు. కానీ 2024 ఎన్నికల నాటికి అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి పంపించి తీరుతాం’’ అని అమిత్‌షా అన్నారు. 

అభివృద్ధో.. మావోయిజమో తేల్చుకోండి
ఝార్ఖండ్‌ ప్రజల ఓట్లే ఆ రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని అమిత్‌ షా అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలో, లేదంటే మావోయిజం వైపు వెళ్లాలో ప్రజల చేతుల్లోనే నిర్ణయం ఉందన్నారు. గత 55 ఏళ్లలో ఝార్ఖండ్‌లో ఏరకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలని కాంగ్రెస్‌కు సవాల్‌ విసిరారు. ‘‘రాహుల్ గాంధీ ఈ రోజు ఝార్ఖండ్‌లోనే ఉన్నారు. ఆయన్ను ఒకటి అడగదలచుకున్నా. గత 55 ఏళ్ల కాంగ్రెస్‌ ఖాతాలో ఉన్న ఝార్ఖండ్‌లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో చెప్పాలి’’ అని సవాల్‌ విసిరారు. ప్రతిపక్ష శిబిరంపై తీవ్ర స్థాయిలో అమిత్‌ షా ధ్వజమెత్తారు. గిరిజనులను నాశనం చేస్తున్నారన్నారు. రూ. కోట్ల కుంభకోణాల్లో మునగడం.. ఎన్నికల్లో టిక్కెట్లు విక్రయించడం.. వంటి పనులే తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడంలేదని ఆరోపించారు. మొత్తం 81 స్థానాలు ఉన్న రాష్ట్ర అసెంబ్లీకి ఐదు దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. నవంబర్‌ 30న తొలి విడత పోలింగ్‌ జరగ్గా.. ఈ నెల 7న రెండో విడత పోలింగ్‌ జరగనుంది.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.