యెస్‌ బ్యాంక్‌: అనిల్‌ అంబానీకి సమన్లు
close

తాజా వార్తలు

Updated : 16/03/2020 15:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యెస్‌ బ్యాంక్‌: అనిల్‌ అంబానీకి సమన్లు

దిల్లీ: యెస్‌బ్యాంక్‌ సంక్షోభంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సమన్లు జారీ చేసింది. బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఇప్పటికే మనీలాండరింగ్‌ కేసులో అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో అనిల్‌ అంబానీకి సమన్లు జారీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు ముంబయిలోని ఈడీ కార్యాలయంలో సోమవారం హాజరు కావాలని ఆయన్ను ఆదేశించింది. అనిల్‌ అంబానీకి చెందిన కంపెనీలు యెస్‌ బ్యాంకు నుంచి పొందిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మారినట్లు ఈడీ పేర్కొంది. అయితే అనారోగ్య కారణాల వల్ల ఈ రోజు విచారణకు హాజరుకాలేనని అనిల్‌ అధికారులకు తెలిపినట్లు సమాచారం. అనిల్‌తోపాటు యెస్‌బ్యాంకు నుంచి రుణాలు పొందిన ప్రధాన కంపెనీల ప్రమోటర్లందరికీ సమన్లు జారీచేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.

అనిల్‌ అంబానీకి చెందిన కంపెనీలు యెస్‌ బ్యాంకు నుంచి రూ.12,800 కోట్ల రుణాలు తీసుకున్నట్లు సమాచారం. ఇవన్నీ నిరర్థక ఆస్తులుగా మారినట్లు తెలుస్తోంది. మార్చిన 6న నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అనిల్‌ అంబానీ గ్రూప్‌ పేరు ప్రస్తావించారు. ఎస్సెల్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సహా అనిల్ అంబానీ గ్రూప్‌ కంపెనీల ప్రభావం యెస్‌ బ్యాంక్‌పై ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని