ఒకే దశలో ఎన్నికలు నిర్వహించండి
close

తాజా వార్తలు

Published : 20/04/2021 15:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒకే దశలో ఎన్నికలు నిర్వహించండి

ఈసీకి తృణమూల్‌ మెమొరాండం
ఎన్నికల నిర్వహణపై అనుమానాలు

కోల్‌కతా: దేశవ్యాప్తంగా కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో పశ్చిమ్‌బంగాల్‌  అసెంబ్లీకి జరగాల్సిన 6, 7, 8 విడత ఎన్నికలను ఒకే దశలో నిర్వహించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి మొమొరాండం సమర్పించింది. దేశంలో పరిస్థితులు అంతకంతకూ ప్రమాదకరంగా మారుతున్నాయని, చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించాలని కోరింది. రానున్న మూడు దశల ఎన్నికలను ఒకే దశలో నిర్వహించేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. 

గతంలోనూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇదే విషయంపై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. కానీ, ఒకే దశలో ఎన్నికలు నిర్వహించలేమని తృణమూల్‌ అభ్యర్థనను ఈసీ తోసిపుచ్చింది. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో తృణమూల్‌ మరోసారి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం గమనార్హం. దీనిపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు 8 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఇప్పటికే 5 దశల్లో 180 స్థానాలకు ఎన్నికలు పూర్తవ్వగా ఏప్రిల్‌ 22, 26, 29 తేదీల్లో మిగతా స్థానాలకు పోలింగ్‌ నిర్వహించాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని