close

తాజా వార్తలు

Published : 06/03/2021 08:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. పంట పండాకే ఇంటికెళ్తాం

పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ రైతులు దిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి వంద రోజులు పూర్తయ్యింది. నవంబరు 26న దేశ రాజధానిలో ప్రదర్శన కోసం తరలివచ్చిన వేల మంది కర్షకులు.. దిల్లీ నగరంలోకి అనుమతి నిరాకరణతో సింఘు, టిక్రీ, గాజీపుర్‌లలో శిబిరాలను నిర్మించుకొని ధర్నాలు కొనసాగిస్తున్నారు. ఆ మూడు ప్రాంతాలు ఇప్పుడు ఉద్యమకారుల ఆవాసాలుగా మారిపోయాయి. సాగు చట్టాల రద్దుపై కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలు జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నేతృత్వంలో పోరాటానికి రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ట్రాన్స్‌జెండర్లు రక్తదానం చేయొద్దా?

ట్రాన్స్‌జెండర్ల నుంచి రక్తం స్వీకరించకూడదంటూ 2017లో కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో శుక్రవారం వ్యాజ్యం దాఖలయింది. రక్తదాతల జాబితా నుంచి ట్రాన్స్‌జెండర్లతో పాటు, పురుష స్వలింగ సంపర్కీయులు, మహిళా సెక్స్‌వర్కర్లను తొలగించింది. హెచ్‌ఐవీ పాచ్కీజిజిటివ్‌, హైపటైటిస్‌ వ్యాధులు వ్యాపించకుండా ఈ నిర్ణయం తీసుకొంది. అయితే శాశ్వతంగా వారిపై నిషేధం విధించడం హక్కులకు భంగకరమంటూ మణిపూర్‌కు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్‌ హక్కుల కార్యకర్త ఈ దావా వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఖాళీగా కూర్చుని లక్షల్లో జీతాలు!

రైతు శిక్షణ కేంద్రాలలో రైతులకు ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించకుండా సిబ్బంది ఖాళీగా కూర్చుని నెలనెలా రూ.లక్షల వేతనాలు తీసుకుంటున్నారు. పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ కేంద్రాలున్నాయి. కరీంనగర్‌ రైతు శిక్షణ కేంద్రంలో ఇద్దరు సహాయ సంచాలకులు (ఏడీ), ఇద్దరు వ్యవసాయాధికారులు, సీనియర్‌ అసిస్టెంటు, జూనియర్‌ అసిస్టెంటు, ఒక అటెండర్‌ ఉన్నారు. ఏడాదిన్నర నుంచి వీరంతా ఖాళీగా కూర్చుంటున్నారు. నిధులేమీ లేనందున రైతులకు ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం లేదని ‘ఈనాడు’కు అక్కడి ఉద్యోగి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఊడిన జుట్టు తిరిగి వస్తుందా?

కొవిడ్‌ బారినపడ్డ చాలామందికి ఈ సమస్య వచ్చింది. ఆ సమయంలో వాడిన యాంటీ వైరల్స్‌, స్టెరాయిడ్ల వల్ల ఇలా జరుగుతుంది. ఒత్తిడి, భయం, నీరసం, వ్యాధినిరోధక శక్తి తగ్గడం వల్లా ఈ ఇబ్బంది రావొచ్చు. తినే పదార్థాల్లో జింక్‌, ఇనుము, ఫోలిక్‌యాసిడ్లు ఉండేలా చూసుకోవాలి. అలానే విటమిన్‌-ఎ ఎక్కువగా ఉండే చిలగడదుంప, పాలకూర, క్యారెట్లు, పాలు, గుడ్లు తీసుకోవాలి. వీటితో పాటు విటమిన్‌-డి లభించే చేపలు, పుట్టుగొడుగులు వంటివి తినాలి. ఈ పోషకాలన్నీ కలగలిసిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ సమస్యను అధిగమించొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. యువతిపై 60 మంది అత్యాచారం!

ఝార్ఖండ్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తనను అపహరించి నెలరోజుల పాటు బంధించి 60 మంది దుండగులు అత్యాచారం చేసినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు మత్తుమందు ఇచ్చి అఘాయిత్యం చేసేవారని, మాట వినకపోతే కొట్టి హింసించేవారని చెప్పింది. సరాయ్‌కేలా-ఖర్‌సావా జిల్లాలోని కందర్‌బేరా సమీపంలో మూతపడిన గ్యారేజ్‌లో ఇన్నాళ్లు బంధించారని, గురువారం బహిర్భూమికి వెళ్లాలని చెప్పి వారి నుంచి తప్పించుకొని వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏసీబీకి చిక్కిన ‘ఉత్తమ సర్పంచి’

6. జులై 5, 6 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌

ఈసారి ముందుగా ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు జరగనున్నాయి. జులై 5, 6 తేదీల్లో ఇంటర్‌ బైపీసీ విద్యార్థుల కోసం నిర్వహించే అగ్రికల్చర్‌ విభాగం పరీక్షలు జరుపుతారు. ఆ తర్వాత జులై 7, 8, 9 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 5 నుంచి 9 వరకు ఎంసెట్‌ నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి గత నెలలోనే వెల్లడించింది. అయితే ఏ విభాగం పరీక్షలు ముందుగా జరుపుతారు? దేనికి ఎన్ని రోజులన్నది స్పష్టత ఇవ్వలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కొత్త ఇళ్లతో బోలెడు లాభాలు!

స్థిరాస్తి మార్కెట్‌ ఆశాజనకంగా ఉండటంతో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవాలు ఊపందుకున్నాయి. విక్రయాలు బాగుండటంతో మరిన్ని సంస్థలు కొత్త ప్రాజెక్ట్‌లు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. గత ఏడాది కొవిడ్‌ మహమ్మారితో వాయిదా పడిన ప్రాజెక్ట్‌లు సైతం ప్రస్తుతం పట్టాలెక్కుతున్నాయి. స్థలాల వెంచర్లు, విల్లా ప్రాజెక్ట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీల వరకు వీటిలో ఉన్నాయి. మార్కెట్‌లో పోటీ నెలకొనడంతో ఆయా సంస్థలు ప్రీలాంచ్‌, సాఫ్ట్‌లాంచ్‌, న్యూలాంచ్‌ పేరుతో కొనుగోలుదారులను ఆశ్రయిస్తున్నారు. రెరా వచ్చాక ప్రీలాంచ్‌ చట్ట విరుద్ధమైనా మార్కెట్లో వీటి పేరుతో పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. స్మార్ట్‌తో ప్రయోజనాలెన్నో

 స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లు విద్యుత్‌ వినియోగాన్ని పర్యవేక్షించటం, నియంత్రించటంలో వినియోగదారులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తాయని తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి ఛైర్మన్‌ శ్రీరంగారావు అభిప్రాయపడ్డారు. వినియోగదారులకు, విద్యుత్‌ పంపిణీ సంస్థలకు మధ్య ‘టూవే కమ్యూనికేషన్‌’కు అవకాశం కల్పిస్తాయని తెలిపారు. పంపిణీ సంస్థలు నష్టాల నుంచి గట్టెక్కడానికి దోహదం చేస్తాయని చెప్పారు. పాతమీటర్లను మార్చటం వల్ల వినియోగదారునిపైన ఎలాంటి భారం పడదని స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బావా అనడమే నా తప్పా?

అక్క ఒకతన్ని మూడేళ్లుగా ప్రేమిస్తోంది. బాగా కష్టపడి ఈమధ్యే వాళ్లిద్దరూ పెద్దలను పెళ్లికి ఒప్పించారు. సమస్య ఏంటంటే.. ఆ అబ్బాయి ఇప్పుడు అక్కను కాదని నా వెంట పడుతున్నాడు. నిన్నే ఇష్టపడుతున్నా  అంటున్నాడు. ఎలాగూ అక్కను పెళ్లి చేసుకోబోతున్నాడు కదా అని తనని ‘బావ’ అని పిలుస్తూ సరదాగా ఉండేదాన్ని. చిన్నచిన్న ట్రీట్స్‌ ఇవ్వమంటూ తనతో హోటళ్లు, రెస్టరెంట్లకు తిరిగేదాన్ని. అదే నేను చేసిన పొరపాటు. సమస్య ఇంతదాకా వస్తుందనుకోలేదు. కొన్నాళ్లకు తను అకస్మాత్తుగా ‘నువ్వంటే ఇష్టం’ అనడం మొదలుపెట్టాడు. ‘మీ అక్క మూడీ.. నన్ను సరిగా అర్థం చేసుకోదు. నువ్వు సరదాగా ఉంటావు. నిన్నే పెళ్లి చేసుకుంటా’ అంటున్నాడు. నాకేం చేయాలో తెలియడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నేనున్నానని..

‘‘పంత్‌కు మతి పోయినట్లుంది. అండర్సన్‌ బౌలింగ్‌లో.. అదీ కొత్తబంతితో ఎవరైనా రివర్‌ స్వీప్‌ ఆడతారా’’.. ఇవీ 23 ఏళ్ల పంత్‌ గురించి సామాజిక మాధ్యమాల్లో కనిపించిన వ్యాఖ్యలు! అవును.. ఎవరి అంచనాలకు అందని విధంగా ఆడటమే అతని నైజం! పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా.. ఒత్తిడి చిత్తు చేస్తున్నా.. తనదైన శైలిలో చెలరేగడమే అతడికి అలవాటు. ఆస్ట్రేలియా పర్యటనలో ఇలాంటి ఇన్నింగ్స్‌లతోనే సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన అతను.. ఇప్పుడీ శతకంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు భారత్‌ను మరింత చేరువ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సెహ్వాగ్‌ మెరుపులు  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని