IND vs NEP: ఆసియా గేమ్స్‌.. సెమీస్‌కు చేరిన టీమ్‌ఇండియా

ఆసియా క్రీడలు: పురుషుల క్రికెట్‌ విభాగంలో భారత్ సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్‌లో (IND vs NEP) నేపాల్‌పై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 202/4 స్కోరు చేసింది. యశస్వి జైస్వాల్ (100: 49 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో నేపాల్ 179/9 స్కోరుకే పరిమితమైంది. దీపేంద్ర సింగ్ ఐరీ (32) టాప్‌ స్కోరర్. భారత బౌలర్లు అవేశ్ ఖాన్ 3, రవి బిష్ణోయ్ 3, అర్ష్‌దీప్‌ సింగ్ 2, సాయి కిశోర్ ఒక వికెట్ తీశారు.

Updated : 03 Oct 2023 09:58 IST