whatsapp: భయం అవసరం లేదు

తాజా వార్తలు

Updated : 27/05/2021 14:51 IST

whatsapp: భయం అవసరం లేదు

ఐటీ నిబంధనలపై కేంద్రం స్పష్టత

దిల్లీ: సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని ఆపేందుకే కొత్త ఐటీ నిబంధనలను తీసుకువచ్చామని కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. వినియోగదారుల గోప్యత హక్కును ప్రభుత్వం గుర్తిస్తుందని మరోసారి ప్రకటించారు. కొత్త నిబంధనల అమలు విషయంలో కేంద్రం, వాట్సాప్ మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. 

‘ప్రజల గోప్యతకు ఏమాత్రం భంగం కలగకుండా.. ప్రభుత్వం దాన్ని గుర్తించి, గౌరవిస్తుంది. వాట్సాప్ వినియోగదారులు కొత్త నిబంధనల గురించి భయపడాల్సిన పనిలేదు. తాము నిబంధనల్లో పేర్కొన్న నేరాలకు మూలాలను గుర్తించడమే ఇక్కడ ప్రధాన లక్ష్యం. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత, ప్రజాపాలన, అత్యాచారం, చిన్నారులపై లైగింక వేధింపులు వంటి నేరాల్లో మాత్రమే ప్రభుత్వం వివరాలు కోరుతుంది. అది కూడా ఇతర చర్యలు ప్రభావంతగా లేనప్పుడు మాత్రమే. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేయడాన్ని నిరోధించేందుకు మాత్రమే ఈ నిబంధనలను రూపొందించాం. వీటిపై ఎవరైనా ప్రశ్నలు లేవనెత్తవచ్చు. సాధారణ వినియోగదారులు సామాజిక మాధ్యమాల్లో ఇబ్బందులకు గురైనప్పుడే ఇవి అమలవుతాయి’ అని రవిశంకర్ ప్రసాద్ వివరించారు. 

కేంద్రం ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో తీసుకువచ్చిన ఐటీ నిబంధనలే కేంద్రం, వాట్సాప్ మధ్య వివాదానికి కారణంగా మారింది. సామాజిక మాధ్యమ సంస్థలకు ఇచ్చిన మూడునెలల గడువు ముగియడంతో ఈ బుధవారం అవి అమల్లోకి వచ్చాయి. భారత ప్రభుత్వం విధించిన నిబంధనలు పూర్తిగా అమలు చేస్తే వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందని, అందుకు తాము సిద్ధంగాలేమని చెప్తూ.. వాట్సాప్ కోర్టు మెట్లెక్కింది. ఇది ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని