బెజోస్ ప్రకటన: పిచాయ్, నాదెళ్ల ఏమన్నారంటే..

తాజా వార్తలు

Published : 04/02/2021 01:59 IST

బెజోస్ ప్రకటన: పిచాయ్, నాదెళ్ల ఏమన్నారంటే..

వాషింగ్టన్‌: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ నిర్ణయంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల వంటి టెక్‌ దిగ్గజాలు స్పందించారు. ఈ ఏడాది చివరికల్లా అమెజాన్ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నట్లు బెజోస్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో అమెజాన్ వెబ్ సర్వీస్ హెడ్ ఆండీ జస్సీ సీఈఓగా నియమితులు కానున్నారు. ఈ క్రమంలో వారిరువురూ జెఫ్‌కు అభినందనలు తెలిపారు.  

సుందర్ పిచాయ్: అమెజాన్ డే1, ఎర్త్‌ ఫండ్‌పై దృష్టి పెట్టనున్న జెఫ్ బెజోస్‌కు శుభాకాంక్షలు. కొత్త బాధ్యతలు స్వీకరించనున్న జస్సీకి అభినందనలు.
సత్య నాదెళ్ల: నూతన బాధ్యతలు స్వీకరించనున్న జెఫ్ బెజోస్, ఆండీ జస్సీకి అభినందనలు. ఈ స్థాయి గుర్తింపునకు మీరు పూర్తిగా అర్హులు.

ఆన్‌లైన్‌లో పుస్తకాలు అమ్మేందుకు అమెజాన్‌ను ప్రారంభించిన బెజోస్‌..అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు అమెజాన్‌ను కనిపెట్టుకువచ్చానని, ఇక ఈ పదవి నుంచి మారడం సరైన సమయమని తన ఉద్యోగులకు రాసిన లేఖలో బెజోస్ వెల్లడించారు. సీఈఓగా దిగిపోతున్నప్పటికీ.. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. బెజోస్ ఎర్త్‌ ఫండ్‌, బ్లూ ఆరిజిన్‌ ఏరో స్పేస్‌ కంపెనీ, ఆమెజాన్ డే 1ఫండ్‌పై మరింత దృష్టి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. 

ఇవీ చదవండి:

రైతు ఉద్యమానికి థన్‌బర్గ్, రిహానా మద్దతు!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని