Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 73737
            [news_title_telugu_html] => 

ఆ ట్వీట్‌కి నిమిషానికి 1,000 లైకులు

[news_title_telugu] => ఆ ట్వీట్‌కి నిమిషానికి 1,000 లైకులు [news_title_english] => With 1000 likes per minute PM Modis tweet on surprise message goes viral [news_short_description] => సామాజిక మాధ్యమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉండే ఫాలోయింగ్‌ గురించి తెలిసిందే. ఆయనకు ట్విటర్‌లో 46.6 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. ఈయన ఈరోజు ఉదయం 11:45గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్నట్లు ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. మోదీ ఈ ఉదయం 11:23గంటలకు ఈ ట్వీట్‌ చేశారు. అయితే అప్పటి నుంచి ఈ ట్వీట్‌ బాగా వైరల్‌ అయింది. ఈ ట్వీట్‌ పెట్టిన నిమిషాల వ్యవధిలో దీనికి వేలల్లో లైకులొచ్చాయి. [news_tags_keywords] => Narendra Modi,DRDO,Twitter [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-03-28 00:36:59 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆ ట్వీట్‌కి నిమిషానికి 1,000 లైకులు - With 1000 likes per minute PM Modis tweet on surprise message goes viral - EENADU
close

తాజా వార్తలు

ఆ ట్వీట్‌కి నిమిషానికి 1,000 లైకులు

వైరల్‌ అయిన ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌

దిల్లీ: సామాజిక మాధ్యమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉండే ఫాలోయింగ్‌ గురించి తెలిసిందే. ఆయనకు ట్విటర్‌లో 46.6 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. ఈయన ఈరోజు ఉదయం 11:45గంటలకు జాతినుద్దేశించి మాట్లాడనున్నట్లు ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. మోదీ ఈ ఉదయం 11:23గంటలకు ఈ ట్వీట్‌ చేశారు. అయితే అప్పటి నుంచి ఈ ట్వీట్‌ బాగా వైరల్‌ అయింది. ఈ ట్వీట్‌ పెట్టిన నిమిషాల వ్యవధిలో దీనికి వేలల్లో లైకులొచ్చాయి. అంతేకాకుండా మోదీ చెప్పబోయే విషయం ఏమై ఉంటుందా! అని దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. దీన్ని పోస్ట్‌ చేసిన వెంటనే నిమిషానికి 1,000 చొప్పున లైకులొచ్చాయి. అయితే  2016 నవంబరు 8న ఇదే తరహాలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు ముందే ప్రకటించారు. అనంతరం నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దే చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు కూడా మరోసారి ఇలాంటి కీలక ప్రకటన ఏదైనా చేస్తారేమోనని నెటిజన్లు ఆతృతగా ఎదురు చూశారు.

ముందుగా చెప్పినట్లు ప్రధాని మోదీ జాతి ప్రజలకు ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. అంతరిక్షంలో భారత్‌ అద్భుతమైన విజయం సాధించిందని మోదీ తెలిపారు. అత్యంత కఠినమైన మిషన్‌ శక్తి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసి, అంతరిక్ష శక్తిసామర్థ్యాల్లో భారత్‌ అగ్రదేశాల సరసన చేరిందని కొనియాడారు. ‘మిషన్‌ శక్తి అనేది అత్యంత కఠినమైన ఆపరేషన్‌. దీని ద్వారా అంతరిక్షంలో శాటిలైట్‌ను పడగొట్టాం. ఏ శాట్‌(యాంటీ శాంటిలైట్‌) క్షిపణిని భారత్‌ విజయవంతంగా ప్రయోగించింది. కక్ష్యలో ఇది తక్కువ ఎత్తులోని తిరుగుతున్న ఒక శాటిలైట్‌ను కేవలం 3 నిమిషాల్లోనే కూల్చేసింది. భారత అభివృద్ధి పథంలో ఇదో గొప్ప మైలురాయి’ అని మోదీ తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.