close

తాజా వార్తలు

కడప జాయింట్‌ కలెక్టర్‌పై ఈసీ బదిలీ వేటు

కడప: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని కడప జిల్లాలోని కొన్ని థియేటర్లలో ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ)పై ఈసీ చర్యలు తీసుకుంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ఆ చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వొద్దంటూ గతంలో ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే,  కొన్ని థియేటర్లలో చిత్రం ప్రదర్శించడంతో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జేసీ కోటేశ్వరరావును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలతో సంబంధం లేని విధుల్లో ఆయన్ను నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నెల 19 వరకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను విడుదల చేయొద్దని మరోసారి ఈసీ స్పష్టం చేసింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.