News in pics : చిత్రం చెప్పే విశేషాలు (30-04-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 30 Apr 2024 04:21 IST
1/10
హైదరాబాద్‌: అయిదు నెలలుగా రాష్ట్రంలో అట్టహాసంగా సాగిన గుజరాతీ ఏక్తా మహోత్సవ్‌ ఘనంగా ముగిసింది. శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధి సాతంరాయిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం రాత్రి నిర్వహించిన మిస్‌ గుజరాతీ, తెలంగాణ-2024 పోటీలు అలరించాయి. నృత్యాలు, ఫ్యాషన్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చిన యువతకు ఈ సందర్భంగా పురస్కారాలు ప్రదానం చేశారు.

2/10
విశాఖపట్నం: థాయిల్యాండ్‌ దేశం బ్యాంకాక్‌లో జరిగిన ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి డాక్టర్‌ వై.మమతా చౌదరి మూడు టైటిల్స్‌ కైవసం చేసుకున్నారు.

3/10
హైదరాబాద్‌: నగర పరిధిలో వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఆయా శిబిరాల్లో చిన్నారులు సందడి చేస్తున్నారు. సరూర్‌నగర్‌ స్టేడియంలోని ఏర్పాటు చేసిన బాస్కెట్‌బాల్‌ క్రీడా శిబిరంలో పలువురు బాలలు ఆటాడుతూ కనిపించారిలా..

4/10
తమిళనాడు: ఎండలు తీవ్రతరమైన నేపథ్యంలో ఉపశమనం పొందేందుకు నీలగిరి జిల్లాకు కొన్ని వారాలుగా పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వారాంతరపు రోజు శనివారం, ఆదివారం పోటెత్తుతున్నారు. బొటానికల్‌ పార్కు, గులాబి పార్కు, తొట్టపెట్టా కొండ గ్రామంలో రద్దీ కనిపిస్తోంది. బోటు షికారుతో ఆనందంగా గడుపుతున్నారు.

5/10
తమిళనాడు: నీలగిరి జిల్లా ఊటీలో వేసవి పుష్ప ప్రదర్శన మే 17న నిర్వహించనున్నట్లు తొలుత నిర్వాహకులు ప్రకటించారు. ప్రస్తుతం తేదీలో మార్పు చేశారు. మే 10 నుంచి 20వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. ఇందుకోసం బొటానికల్‌ గార్డెన్‌లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

6/10
ప్రకాశం: బ్రహ్మోత్సవాలతో మార్కాపురం పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. నాలుగు యుగాల దేవుడైన శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి శ్రీరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం తెల్లవారు జామున హనుమంత వాహనంపై మాఢ వీధుల్లో వాహనోత్సవం అత్యంత వైభవంగా సాగింది. వాహనం వెంట నడుస్తూ ప్రదర్శించిన కోలాటం, సన్నాయి వాయిద్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

7/10
ఏలూరులోని వైఎంహెచ్‌ఏ హాలులో సోమవారం ప్రపంచ నృత్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వంద మందికిపైగా కళాకారులు నృత్య ప్రదర్శనలిచ్చారు. చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

8/10
హైదరాబాద్‌: నల్లకుంట ప్రధాన రహదారి మీదుగా రాకపోకలు సాగించే వారిని ఆకట్టుకునేలా ఫీవర్‌ ఆసుపత్రి సమీపంలో వర్టికల్‌ గార్డెన్‌ ఏర్పాటు చేశారు. రోజురోజుకూ ఠారెత్తిస్తున్న ఎండలతో.. సంబంధిత మొక్కలు ఎండిపోకుండా వాటికి పైపుతో నీళ్లు పడుతున్నారు. దీంతో ఆ రహదారి మండుటెండల్లోనూ పచ్చందాలతో ఇలా ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

9/10
కరీంనగర్‌: మండలంలోని చిన ముల్కనూర్‌ గ్రామంలో సోమవారం దుర్గమ్మతల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. డప్పుచప్పుళ్లతో శివసత్తుల పూనకాల మధ్య దుర్గమ్మ తల్లి దేవాలయానికి చేరుకొని మొక్కులు సమర్పించారు. ప్రజాప్రతినిధులు, కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.

10/10
నిజామాబాద్‌: చిత్రంలో కనిపిస్తున్న భగీరథ వాల్వ్‌ కామారెడ్డి కలెక్టరేట్‌కు వెళ్లే దారిలోనిది. ఇక్కడ వాల్వ్‌ గాలి తీసుకోవడం వల్ల నీరు నిరంతరం లీకవుతుంది. దీంతో కొందరు అక్కడ ఓ కుండీని పెట్టారు. కుండీలో నీరు పశువులకు ఉపయోగపడుతుంది. సమీప కాలనీలో కొందరి బోరుబావులు వట్టిపోవడంతో కూలర్లలో నీరు పోసుకోవడానికి డబ్బాలతో ఇలా వచ్చి పట్టుకుంటున్నారు.

Tags :

మరిన్ని