ఏపీలోనే ఎక్కువ కరోనా పరీక్షలు: బుగ్గన

తాజా వార్తలు

Updated : 02/05/2020 00:53 IST

ఏపీలోనే ఎక్కువ కరోనా పరీక్షలు: బుగ్గన

విజయవాడ: కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలని సీఎం జగన్ ఆలోచనలు చేస్తుంటే..  చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కువ కరోనా పరీక్షలు చేస్తున్నది రాష్ట్రంలోనే అని వివరించారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు హైరిస్క్‌ జోన్లుగా ఉన్నాయని తెలిపారు. 

ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా పరీక్షల కోసం 9 ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని, త్వరలో నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో కూడా ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎక్కువ పరీక్షలు చేయడం ద్వారా ఎక్కువ మంది బాధితులను గుర్తిస్తున్నామన్నారు. నెలరోజుల్లో టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకోగలిగామని తెలిపారు. కరోనాకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి వివరాలతో నివేదికలు వెల్లడిస్తున్నామని స్పష్టం చేశారు. వేరే రాష్ట్రాల నుంచి రావడం వల్ల కొన్ని జిల్లాల్లో కేసులు పెరిగాయని బుగ్గన తెలిపారు. కరోనాతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 33 మంది చనిపోయారని, వారంతా ఇతర వ్యాధులతో బాధపడేవారు, ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లేనని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని