OnePlus & Oppo: అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తో వన్‌ప్లస్‌, ఒప్పో కొత్త ఓఎస్‌ 
close

Published : 21/09/2021 23:31 IST
OnePlus & Oppo: అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తో వన్‌ప్లస్‌, ఒప్పో కొత్త ఓఎస్‌ 

ఇంటర్నెట్‌డెస్క్‌: గత ఏడాది కాలంగా వన్‌ప్లస్‌ తమ కార్యకలాపాలకు సంబంధించి భారీ మార్పులు చేస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఒప్పోతో విలీనం కావడంతో మొదలైన ఈ మార్పు ఆక్సిజన్ ఓఎస్‌ కోడ్‌బేస్‌ని కలర్‌ ఓఎస్‌తో షేర్ చేసుకునే వరకు వెళ్లింది. తాజాగా దీనికి సంబంధించి వన్‌ప్లస్‌ మరో కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది నుంచి వన్‌ప్లస్‌, ఒప్పో ఫోన్లు పూర్తిగా తమ ఆపరేటింగ్ సిస్టమ్‌ (ఓఎస్‌) సేవలను నిలిపివేయనున్నట్లు ప్రటించింది. వాటి స్థానంలో ఆక్సిజన్‌ ఓఎస్‌, కలర్‌ ఓఎస్‌ కలయికగా కొత్త గ్లోబల్ ఓఎస్‌ను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ‘యూనిఫైడ్‌ అండ్ అప్‌గ్రేడెడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్‌ప్లస్, ఒప్పో ఫోన్లలో ఈ ఓఎస్‌ను అప్‌డేట్ చేయనున్నట్లు సమాచారం. గత ఓఎస్‌ల కంటే కొత్త ఓఎస్‌ అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తో మరింత వేగంగా, సమర్థవంతంగా ఉంటుందట.

టెక్‌ నిపుణులు మాత్రం వన్‌ప్లస్‌, ఒప్పో కలిపి తీసుకొస్తున్న కొత్త ఓఎస్‌లో ఆక్సిజన్‌ ఓఎస్‌ ఫీచర్స్‌ ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఈ ఓఎస్‌ను వన్‌ప్లస్‌ డివైజ్‌లను దృష్టిలో ఉంచుకుని డిజైన్‌ చేస్తున్నారట. దీనివల్ల మొబైల్‌పై ఎక్కువ భారం ఉండదని సమాచారం. ఈ ఓఎస్‌ను వచ్చే ఏడాది వన్‌ప్లస్ 10 సిరీస్‌లో తీసుకొస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్‌లో పరిచయం చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి సమాచారం. అంటే ఆండ్రాయిడ్ 13తోపాటు కొత్త ఓఎస్‌ యూజర్స్‌కి అందుబాటులోకి రావొచ్చు. త్వరలోనే వన్‌ప్లస్‌ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనుంది. వన్‌ప్లస్‌ తన ఓఎస్‌ను చైనాలో హైడ్రోజన్ ఓఎస్‌ పేరుతో, ప్రపంచ మార్కెట్లో ఆక్సిజన్‌ ఓఎస్‌ పేరుతో పరిచయం చేసింది. తాజా మార్పుల నేపథ్యంలో చైనాలో హైడ్రోజన్‌ ఓఎస్‌ సేవలను నిలివేసినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. దాని స్థానంలో ఒప్పో కలర్ ఓఎస్‌తో వన్‌ప్లస్‌ ఫోన్లను విడుదల చేస్తున్నారని సమాచారం.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న