Railway Jobs: రైల్వేలో 5,696 ఉద్యోగాలకు వయో పరిమితిలో మార్పు.. పరీక్షల టైం లైన్‌ ఇదే..!

అసిస్టెంట్‌ లోకోపైలట్‌ ఉద్యోగాలకు వయో పరిమితిలో రైల్వేశాఖ కీలక మార్పు చేసింది. అలాగే, పరీక్షల టైం లైన్‌ను ప్రకటించింది.

Updated : 31 Jan 2024 15:55 IST

RRB ALP Recruitment 2024| ఇంటర్నెట్‌ డెస్క్‌:  రైల్వే శాఖలోని వివిధ జోన్లలో 5,600కు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి గల అభ్యర్థులకు ఫిబ్రవరి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకొనే వెసులుబాటు ఉంది. ఈనేపథ్యంలో రైల్వే మంత్రిత్వశాఖ వయో పరిమితిలో కీలక మార్పు చేసింది. గతంలో ఇచ్చిన ప్రకటనలో వయోపరిమితి 18-30 ఏళ్లుగా పేర్కొనగా.. ఇప్పుడు దాన్ని 33 ఏళ్లకు పెంచడం ద్వారా మరికొంతమందికి అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం జులై 1, 2024 నాటికి 18-33 ఏళ్ల లోపు వయసున్నవారు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కలగనుంది. వివిధ కేటగిరీలకు చెందినవారికి వయో సడలింపు వర్తిస్తుంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు రైల్వే శాఖ సూచించింది. 

అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉద్యోగ దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యా? ఇలా చేయండి!

పరీక్షల టైం లైన్‌ ఇదే..

  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT-1) జూన్‌-ఆగస్టు మధ్య జరిగే అవకాశం ఉన్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది.
  • రెండో దశ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT-2) సెప్టెంబర్‌లో నిర్వహించే వీలుంది. 
  • ఆప్టిట్యూడ్‌ టెస్టు (CBAT) నవంబర్‌లో నిర్వహిస్తారు.
  • ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ తర్వాత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల జాబితాను నవంబర్‌/డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.
  • మరిన్ని ఏఎల్‌పీ ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్‌ వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ పేర్కొంది.

దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని