Fake Jobs: ఆ ఉద్యోగ ప్రకటనపై జాగ్రత్తగా ఉండండి: ద.మ.రైల్వే హెచ్చరిక

రైల్వే శాఖలో 4,660 ఉద్యోగాలంటూ చక్కర్లు కొడుతున్న నకిలీ ప్రకటనపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. ఆ నోటిఫికేషన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 

Updated : 28 Feb 2024 17:37 IST

సికింద్రాబాద్‌: రైల్వే శాఖలో 4,660 ఉద్యోగాలంటూ చక్కర్లు కొడుతున్న నకిలీ ప్రకటనపై దక్షిణ మధ్యరైల్వే స్పందించింది. ఈ నకిలీ ఉద్యోగ నియామక నోటీసుపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ (RPF), రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌లో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి రైల్వేశాఖ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదని స్పష్టంచేస్తూ ట్వీట్‌ చేసింది. 

ఈ ఉద్యోగాలకు ఏప్రిల్‌ 15 నుంచి మే 14 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తుందని పేర్కొంటూ విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఈ నోటిఫికేషన్‌ నకిలీదని ఇటీవల ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై దక్షిణ మధ్య రైల్వే కూడా స్పందించింది. ఎప్పుడూ వ్యక్తిగత/ఆర్థికపరమైన సమాచారాన్ని షేర్‌ చేయొద్దని ప్రజలకు సూచించింది. ఆర్‌పీఎఫ్‌లో 452 ఎస్సై, 4,208 కానిస్టేబుల్‌ పోస్టుల సంఖ్య, వేతనం, వయోపరిమితి, విద్యార్హతలు, ఉద్యోగ నియామక ప్రక్రియ, దరఖాస్తు రుసుం వంటి అంశాలతో కూడిన ఈ నకిలీ ప్రకటనను ఎవరూ నమ్మొద్దని పేర్కొంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు