రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్‌ టిప్స్‌

Resume Tips: రెజ్యూమె ప్రిపేర్‌ చేసే సమయంలో చేయకూడని మూడు తప్పుల గురించి మాట్లాడారు గూగుల్‌ మాజీ రిక్రూటర్‌ నోలన్‌ చర్చ్‌.

Updated : 24 Apr 2024 17:36 IST

Resume Tips | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి అవకాశాన్ని చేజిక్కించుకోవాలంటే ప్రతీ విషయంలోనూ ఆచితూచి అడుగేయాల్సిందే. ముఖ్యంగా రెజ్యూమె (Resume) విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనేటప్పుడు, ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు రిక్రూటర్లు ముందుగా చూసేది రెజ్యూమెనే. అయితే హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌ల వద్దకు రోజూ వందలాది రెజ్యూమెలు వస్తుంటాయి. వాటిలో అర్హతలు, నైపుణ్యాలతో ఆకర్షించేలా మన రెజ్యూమెను తయారుచేయడం చాలా ముఖ్యం అంటున్నారు ఫెయిర్‌ కాంప్ సీఈఓ, గూగుల్‌ మాజీ రిక్రూటర్‌ నోలన్‌ చర్చ్‌. ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. అభ్యర్థులు రెజ్యూమెని రూపొందించడంలో చేయకూడని మూడు తప్పుల గురించి మాట్లాడారు.

5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్‌లో కొత్త ఫోన్లు

  • రెజ్యూమెలోని వాక్యాలన్నీ గరిష్ఠంగా 25 పదాల కంటే తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. అంతకంటే తక్కువ ఉంటే ఇంకా మంచిది. రిక్రూటర్‌లు ప్రతీ రెజ్యూమెని చూడాల్సి ఉంటుంది. అంటే ఒక్కో దాన్ని పరిశీలించడానికి వారికి కేవలం మూడు నుంచి ఐదు సెకన్లు మాత్రమే సమయం ఉంటుంది. అందుకే సులభంగా అర్థమయ్యేలా చిన్న పదాలతో రూపొందించాలి.
  • రెజ్యూమె రూపొందించడంలో ఎక్కువగా చేసే తప్పు కీవర్డ్స్‌ను ఉపయోగించడం.  సాధారణంగా కెరీర్‌ ఎక్స్‌పర్ట్‌లు జాబ్‌ డిస్క్రిప్షన్‌కు అనుగుణంగా కీ వర్డులు వినియోగించమని చెబుతుంటారు. కొందరు అభ్యర్థులు ఇంకాస్త ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలా ఎక్కువ పదాలు వాడటం మంచిది కాదంటారు చర్చ్‌. జాబ్‌ డిస్క్రిప్షన్‌లో బుల్లెట్‌ పాయింట్స్‌ రాసేటప్పుడు ప్రతీ వాక్యంలోనూ ఒకటి కంటే ఎక్కువ కీవర్డ్స్‌ వాడొద్దనే నియమాన్ని పెట్టుకోవాలని సూచించారు.
  • ఉద్యోగంలో భాగంగా బాస్‌కు ఇ-మెయిల్‌ చేయడం, ప్రతీ త్రైమాసికానికి లక్ష్యాలు నిర్దేశించుకోవడం వంటి రొటీన్‌ అంశాలను రెజ్యూమెలో పొందుపరచకపోవడం మంచిది. వాటివల్ల వచ్చే ప్రయోజనం ఏమాత్రం ఉండదు. దానికి బదులు ఒక వ్యాపారానికి నిర్దిష్టంగా తామెలా ఉపయోగపడిందీ పేర్కొనాలి. కొత్త కస్టమర్లను తీసుకురావడం, సేల్స్‌ టార్గెట్‌ను అధిగమించడం వంటి అంశాలను అందులో ప్రస్తావించాలి. అవసరమైతే మీ పనితీరును స్పష్టంగా తెలియజేసేలా గణాంకాలు కూడా పేర్కొంటే ఇంకా మంచిది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని