CMAT exam: ‘సీమ్యాట్‌’ పరీక్ష తేదీ ఖరారు

మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీమ్యాట్ పరీక్ష తేదీ ఖరారైంది.

Updated : 24 Apr 2024 20:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యా సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్ (CMAT)కు దరఖాస్తుల గడువు నిన్నటితో ముగిసింది. దీంతో ఏప్రిల్‌ 24 నుంచి 26 వరకు దరఖాస్తుల్లో పొరపాట్లు సవరణకు అవకాశం కల్పించిన ఎన్‌టీఏ (NTA).. తాజాగా పరీక్ష తేదీని ఖరారు చేసింది. మే 15న సీమ్యాట్‌ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

వేసవి సెలవులు గుర్తుండిపోయేలా.. కొత్తగా ఇలా చేసేద్దామా?

మార్చి 19 నుంచి 23 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఎన్‌టీఏ.. ఈ పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఆఫ్‌ ఎగ్జామ్‌ సెంటర్‌ సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ల కోసం www.nta.ac.in, https://exams.nta.ac.in/CMAT/ వెబ్‌సైట్లలో చెక్‌ చేసుకోవాలని సూచించింది. ఏవైనా సందేహాలు ఉంటే cmat@nta.ac.inలో సంప్రదించాలని కోరింది. ఈ పరీక్షలో సాధించిన స్కోరుతో దాదాపు వెయ్యి విద్యా సంస్థల్లో విద్యార్థులు మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని