నోటిఫికేషన్స్
ప్రభుత్వ ఉద్యోగాలు
హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్‌లు
50 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది.
అర్హత: ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారు అనర్హులు. వృత్తిపరమైన నైపుణ్యాలను దరఖాస్తులో పేర్కొనాలి. వయసు: 11-01-2023 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఆదిమ తెగలు/ బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ఎంపిక: సీబీటీ/ ఓఎమ్మార్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ప్రశ్నపత్రం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)/ ఓమ్మార్ పరీక్షలో 45 (జనరల్ నాలెడ్జ్) ప్రశ్నలుంటాయి. ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. దరఖాస్తు రుసుము: ఓసీ/ బీసీ అభ్యర్థులకు రూ.600 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400).
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 21-01-2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-02-2023.
కంప్యూటర్ ఆధారిత/ ఓఎమ్మార్ పరీక్ష తేదీ: మార్చి 2023.
వెబ్‌సైట్: https://tshc.gov.in/getRecruitDetails
సిడ్బీలో 15 స్పెషలిస్ట్ ఖాళీలు
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) ఒప్పంద ప్రాతిపదికన 15 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* చీఫ్ టెక్నికల్ అడ్వైజర్, డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఆడిట్ కన్సల్టెంట్, ఎకనమిక్ అడ్వైజర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ/ మాస్టర్స్ డిగ్రీ.
ఎంపిక: మెరిట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా. ఈమెయిల్: recruitment@sidbi.in
దరఖాస్తుకు చివరి తేదీ: 28.01.2023
వెబ్‌సైట్: https://www.sidbi.in/en/careers
ఈవీఎం కన్సల్టెంట్ కొలువులు
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బేసిల్) ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో 18 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: గ్రాడ్యుయేషన్. అనుభవం: కనీసం 3 ఏళ్ల పని అనుభవం.
ఎంపిక: స్కిల్‌టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.885.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.01.2023
వెబ్‌సైట్: https://www.becil.com/vacancies
వాక్-ఇన్స్
ఎయిమ్స్-భోపాల్‌లో 16 ప్రొఫెసర్ పోస్టులు
భోపాల్‌లోని ఎయిమ్స్‌లో 16 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ కానున్నాయి.
విభాగాలు: గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, న్యూరాలజీ, ఆప్త్తాల్మాలజీ, ఫిజికల్ మెడిసిన్, సర్జికల్ ఆంకాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ ఎండీ/ ఎంఎస్/ ఎంసీహెచ్/ డీఎం. అనుభవం: కనీసం 1-3 ఏళ్ల్ల పని అనుభవం.
వయసు: 50 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.2000.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ వేదిక: ఎయిమ్స్, భోపాల్. ఇంటర్వ్యూ తేదీ: 19.01.2023
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటల నుంచి.
వెబ్‌సైట్: https://aiimsbhopal.edu.in/index_controller/career
ఎన్‌డీఆర్‌ఐ-హరియాణాలో...
హరియాణాకు చెందిన ఐకార్ ఆధ్వర్యంలోని నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌డీఆర్‌ఐ)10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ప్రాజెక్ట్ అసిస్టెంట్, యంగ్‌ప్రొఫెషనల్, జూనియర్ రిసెర్చ్ ఫెలో తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ/ పీహెచ్‌డీ.
వయసు: 21-45 ఏళ్లు ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: జనవరి 20, 23, 24, 25
వెబ్‌సైట్: https://ndri.res.in/jobnopportunities/
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: ఏఈ ప్రశ్నపత్రం ఎంతమందికి విక్రయించారు?.. కొనసాగుతోన్న మూడో రోజు సిట్ విచారణ
-
India News
Tourism: ఈ దేశాల్లో పర్యటన.. భారతీయులకు చాలా సులువు
-
World News
School Shooting: పక్కా ప్రణాళిక రచించి.. మ్యాపుతో వచ్చి..: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
-
Movies News
Nani: ఆ రాంబాబేనా ఈ ‘ధరణి’?.. ఆసక్తికరం నాని జర్నీ!
-
Crime News
Vizag : ఆత్మహత్య చేసుకుంటామని బంధువులకు సెల్ఫీ వీడియో పంపిన దంపతులు..
-
India News
Rahul Gandhi: ‘చట్టాన్ని గౌరవించడమే.. ’: రాహుల్ ‘అనర్హత’పై అమెరికా స్పందన ఇదే..