నోటిఫికేషన్స్

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ (నిక్‌మార్‌)  ఫుల్‌టైం ఆన్‌-క్యాంపస్‌ పీజీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 18 Jan 2023 04:43 IST

ప్రవేశాలు

నిక్‌మార్‌, హైదరాబాద్‌లో పీజీ  

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ (నిక్‌మార్‌)  ఫుల్‌టైం ఆన్‌-క్యాంపస్‌ పీజీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పీజీ  

2. ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పీజీ  

3. సస్టెయినబుల్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పీజీ

4. లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పీజీ

5. క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌లో ఏడాది పీజీ 6. హెల్త్‌ సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌లో ఏడాది పీజీ

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ (ఇంజినీరింగ్‌/ ఆర్కిటెక్చర్‌/ ప్లానింగ్‌. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులూ అర్హులే. దరఖాస్తు రుసుము: ఒక కోర్సుకు రూ.2,100; ఒకటి కంటే ఎక్కువ కోర్సులకు రూ.2,620.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01-02-2023.ప్రవేశ పరీక్ష, బృంద చర్చలు, ఇంటర్వ్యూ తేదీలు: 20.02.2023 నుంచి 26.02.2023 వరకు. ప్రవేశ ఫలితాల వెల్లడి: 06-03-2023.  

వెబ్‌సైట్‌:https://www.nicmar.ac.in/hyderabad


ప్రభుత్వ ఉద్యోగాలు
హైకోర్టులో కంప్యూటర్‌ ఆపరేటర్‌లు

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 20 కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ(ఆర్ట్స్‌/ సైన్స్‌/ లా) లేదా దానికి సమానమైన పట్టా. ఇంగ్లిష్‌ హయ్యర్‌ గ్రేడ్‌ టైప్‌రైటింగ్‌, పీజీ డిప్లొమా (కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) లేదా బీసీఏ ఉండాలి.
వయసు: 11-01-2023 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఆదిమ తెగలు/ బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ఎంపిక: సీబీటీ పరీక్ష(50 మార్కులు), టైపింగ్‌ టెస్ట్‌(40 మార్కులు), ఇంటర్వ్యూ(10 మార్కులు) ఆధారంగా.
దరఖాస్తు రుసుము: ఓసీ/ బీసీ అభ్యర్థులకు రూ.600 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400).
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 21-01-2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11-02-2023.
హాల్‌ టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 20-02-2023.
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీ: మార్చి 2023.

వెబ్‌సైట్‌: https://tshc.gov.in/getRecruitDetails


ఎల్‌ఐసీలో 300 ఏఏఓ ఉద్యోగాలు

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) 300 అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (జనరలిస్ట్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కేటగిరీ వారీగా ఖాళీలు:
ఎస్సీ: 50 బీ ఎస్టీ: 27బీ ఓబీసీ: 84
ఈడబ్ల్యూఎస్‌: 27 బీ అన్‌రిజర్వ్‌డ్‌: 112
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌/ బ్యాచిలర్స్‌ డిగ్రీ.
వయసు: 01.01.2023 వరకు 21-30 ఏళ్లు ఉండాలి.
ప్రొబేషన్‌ వ్యవధి: ఏడాది.
ఎంపిక: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.700.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2023
ప్రిలిమినరీ పరీక్ష: 17.02.2023, 20.02.2023.
మెయిన్‌ పరీక్ష: 18.03.2023
వెబ్‌సైట్‌: https://licindia.in/BottomnLinks/care


సిస్టమ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 45 సిస్టమ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది.  
అర్హత: కనీసం 55% మార్కులతో బీఈ, బీటెక్‌ (సీఎస్‌ఈ/ ఐటీ/ ఈసీఈ)/ డిప్లొమా(ఎలక్ట్రానిక్స్‌), బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్‌/ కంప్యూటర్స్‌/ ఐటీ). కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌పై పరిజ్ఞానం అవసరం.
వయసు: 11-01-2023 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఆదిమ తెగలు/ బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ఎంపిక: సీబీటీ పరీక్ష(90 మార్కులు), ఇంటర్వ్యూ(10 మార్కులు) ఆధారంగా.
దరఖాస్తు రుసుము: ఓసీ/ బీసీ అభ్యర్థులకు రూ.600 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400).
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 21-01-2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11-02-2023.
హాల్‌ టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 20-02-2023.
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీ: మార్చి 2023.
వెబ్‌సైట్‌: https://tshc.gov.in/getRecruitDetails


ఏపీ సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో..

ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్ష అభియాన్‌ విజయవాడలోని రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 37 పోస్టుల భర్తీ జరగబోతోంది.  
* జూనియర్‌ అసిస్టెంట్‌: 13  

*డేటా ఎంట్రీ ఆపరేటర్లు: 10

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, టైపింగ్‌ స్కిల్స్‌, ఎంఎస్‌ ఆఫీస్‌/ పీజీడీసీఏ/ డీసీఏ/ ఇంజినీరింగ్‌ సర్టిఫికెట్‌/ కంప్యూటర్‌తో ఏదైనా డిగ్రీ.
ఆఫీస్‌ సబార్డినేట్‌: 14
అర్హత: పదో తరగతి. తెలుగు, ఇంగ్లిషు భాషలు చదవడం, రాయడం తెలిసి ఉండాలి. వయసు: 30.11.2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక: జేఏ, డీఈవో ఖాళీలకు పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ మార్కులు, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా. ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులకు పదో తరగతి మార్కుల ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.500.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2023.
స్కిల్‌ టెస్ట్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాల వెల్లడి: 03.02.2023.
ధ్రువపత్రాల పరిశీలన: 06/ 07.02.2023.
స్కిల్‌ టెస్ట్‌ తేదీ: 11/ 12.02.2023.
ఎంపిక జాబితా వెల్లడి: 13.02.2023.
వెబ్‌సైట్‌: https://apssa.aptonline.in/#


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని