నోటిఫికేషన్స్
ప్రభుత్వ ఉద్యోగాలు
ఎల్‌ఐసీలో 9394 ఏడీఓ ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా ఉన్న ఎల్‌ఐసీ కార్యాలయాల్లో 9394 అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(ఏడీఓ) పోస్టుల భర్తీకి జోన్ల వారీగా నోటిఫికేషన్ విడుదలైంది.
సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్): 1408
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ముంబయిలోని ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ లేదా ఫైనాన్స్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ విభాగంలో రెండేళ్ల పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
వయసు: 01.01.2023 నాటికి 21- 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక: ఆన్‌లైన్ పరీక్షలు (ప్రిలిమినరీ/ మెయిన్ పరీక్ష), ఇంటర్వ్యూ, ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.750.(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100).
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 10-02-2023.
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 12-03-2023.
మెయిన్ పరీక్ష తేదీ: 08-04-2023.
వెబ్‌సైట్: https://licindia.in/
అలహాబాద్ ఎంఎన్‌నిట్‌లో..
యూపీ అలహాబాద్‌లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 103 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ.
దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-02-2023.
వెబ్‌సైట్: https://recruitments.mnnit.ac.in/Nts23/advertisement.aspx
అప్రెంటిస్‌షిప్
డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు
ముంబయిలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది.
* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 115
* డిప్లొమా అప్రెంటిస్: 35
విభాగాలు: కంప్యూటర్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, షిప్ బిల్డింగ్ టెక్నాలజీ.
అర్హత: ఇంజినీరింగ్/ టెక్నాలజీలో డిప్లొమా, డిగ్రీ.
వయసు: 01-01-2023 నాటికి 18- 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్ట్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9000; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000.
ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-02-2023.
ఇంటర్వ్యూ తేదీ: 13-02-2023.
వెబ్‌సైట్: https://mazagondock.in/CareernApprentice.aspx
ప్రవేశాలు
ములుగు అటవీ కళాశాలలో పీహెచ్‌డీ ప్రోగ్రాం
సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీలో ఫారెస్ట్రీ కోర్సుకు ఎఫ్‌సీఆర్‌ఐ (అటవీ కళాశాల, పరిశోధన సంస్థ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అర్హత: ఫారెస్ట్రీ విభాగంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు ఐసీఏఆర్/ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్/ ఎస్‌ఆర్‌ఎఫ్ (పీహెచ్‌డీ) - 2022 స్కోరు.
ఎంపిక: ఎమ్మెస్సీ, ఐసీఏఆర్ ప్రవేశ పరీక్ష స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.2000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1000)
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.01.2023.
ఆలస్య రుసుము రూ.500తో దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2023.
వెబ్‌సైట్: https://www.fcrits.in/
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
School Shooting: పక్కా ప్రణాళిక రచించి.. మ్యాపుతో వచ్చి..: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
-
Movies News
Nani: ఆ రాంబాబేనా ఈ ‘ధరణి’?.. ఆసక్తికరం నాని జర్నీ!
-
Crime News
Vizag : ఆత్మహత్య చేసుకుంటామని బంధువులకు సెల్ఫీ వీడియో పంపిన దంపతులు..
-
India News
Rahul Gandhi: ‘చట్టాన్ని గౌరవించడమే.. ’: రాహుల్ ‘అనర్హత’పై అమెరికా స్పందన ఇదే..
-
Sports News
Virat -Babar: ఆ ఒక్క క్వాలిటీనే వ్యత్యాసం.. అందుకే బాబర్ కంటే విరాట్ అత్యుత్తమం: పాక్ మాజీ ఆటగాడు
-
Crime News
Crime News: శంషాబాద్ విమానాశ్రయంలో కిలోకుపైగా విదేశీ బంగారం పట్టివేత