నోటిఫికేషన్స్
ప్రవేశాలు
దిల్లీ ఐఐటీలో పీజీ, పీహెచ్‌డీ
దిల్లీ ఐఐటీ పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాం(మొదటి సెమిస్టర్)లలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
1. పీహెచ్‌డీ
2. ఎంటెక్, ఎంఎస్(రిసెర్చ్), ఎం.డిజైన్, ఎంపీపీ, ఎంఎస్సీ (హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్)
విభాగాలు: అప్లైడ్ మెకానిక్స్, బయోకెమికల్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, డిజైన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్ స్టడీస్ తదితరాలు.
అర్హత: పీజీ ప్రవేశానికి సంబంధిత విభాగంలో మొదటి శ్రేణిలో బ్యాచిలర్ డిగ్రీ; పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధిత విభాగంలో మొదటి శ్రేణిలో పీజీ.
ఇంజినీరింగ్ విభాగాలకు గేట్, డిజైన్ విభాగాలకు సీడ్ వ్యాలిడ్ స్కోరు ఉండాలి. ఎంఎస్సీ కాగ్నిటివ్ సైన్స్ ప్రోగ్రాంనకు గేట్/ జామ్, జేఆర్‌ఎఫ్, నెట్ వీటిలో ఏదైనా స్కోరు ఉండాలి
ఎంపిక: ప్రవేశ పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.50 చెల్లించాలి).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-03-2023.
పరీక్ష/ ఇంటర్వ్యూ తేదీలు: 16-05-2023 - 16-06-2023.
తరగతులు ప్రారంభం: 24-07-2023.
వెబ్‌సైట్: https://www.jntuk.edu.in/
జేఎన్‌టీయూ కాకినాడలో
పీహెచ్‌డీ తక్షణ ప్రవేశాలు
కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనిర్సిటీ ఏపీఆర్‌సీఈటీ- పీహెచ్‌డీ-2022 ప్రవేశాలకు సంబంధించి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తోంది.
విభాగాలు: సివిల్, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ, ఐటీ, ఎంఈ, ఫిజిక్స్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మ్యాథమెటిక్స్.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ, ఏపీఆర్‌సెట్-2022/ యూజీసీ- నెట్/ యూజీసీ- సీఎస్‌ఐఆర్- నెట్/ స్లట్/ గేట్/ జీప్యాట్ స్కోరు.
స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్: 17-03-2023.
వేదిక: సెనేట్ హాల్, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, జేఎన్‌టీయూకే, కాకినాడ క్యాంపస్.
వెబ్‌సైట్: https://home.iitd.ac.in/
ఉద్యోగాలు
సమీర్-ముంబయిలో సైంటిస్ట్‌లు
ముంబయిలోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రిసెర్చ్(సమీర్) 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. సైంటిస్ట్-బీ: 18 పోస్టులు. బీఈ/ బీటెక్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.వయసు 30 ఏళ్లు మించకూడదు.
2. సైంటిస్ట్-సీ: 03 పోస్టులు. బీఈ/ బీటెక్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్‌డిగ్రీ/ ఎంటెక్/ ఎంఈ ఉత్తీర్ణత.
అనుభవం: కనీసం 2-4 ఏళ్లు.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష/ కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ టెక్నికల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.800.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.04.2023.
వెబ్‌సైట్: https://www.sameer.gov.in/
ఐఐఐటీ-రాయచూర్‌లో..
రాయచూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) 13 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ. 1-3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: faculty.app@iiitr.ac.in
దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2023.
వెబ్‌సైట్: https://iiitr.ac.in/
టీసీఐఎల్, న్యూదిల్లీలో..
న్యూదిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) ఝార్ఖండ్ రాష్ట్రంలో 88 ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీతో పాటు అనుభవం.
వయసు: 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18/03/2023.
వెబ్‌సైట్: www.career-tcil.com/
ఎయిమ్స్ దేవ్‌గఢ్‌లో..
ఝార్ఖండ్ రాష్ట్రం దేవ్‌ఘర్‌లోని ఎయిమ్స్ వివిధ విభాగాల్లో తాత్కాలిక ప్రాతిపదికన 21 సీనియర్ రెసిడెంట్ (నాన్ అకడమిక్) పోస్టుల నియామకానికి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ).
వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ, రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.3000; ఓబీసీలకు రూ.1000.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఎయిమ్స్ దేవ్‌గఢ్ వెబ్‌సైట్‌లలో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రకటన తేదీ: 07.03.2023.
అప్రెంటిస్‌షిప్
కాల్కామ్ విజన్ లిమిటెడ్‌లో..
గ్రేటర్ నోయిడాలోని కాల్కామ్ విజన్ లిమిటెడ్ ఏడాది అప్రెంటిస్‌షిప్ శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
డిప్లొమా అప్రెంటిస్: 210 ఖాళీలు
విభాగాలు: మెకానికల్ డిప్లొమా, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఈఈఈ డిప్లొమా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్.
అర్హత: 2020/ 2021, 2021/ 2022, 2022/ 2023 విద్యా సంవత్సరాల్లో సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
నెలవారీ స్ట్టైపెండ్: రూ.11000.
ఎన్‌ఏటీఎస్ పోర్టల్‌లో వివరాల నమోదుకు చివరి తేదీ: 25.03.2023.
కాల్‌కామ్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 30.03.2023.
వెబ్‌సైట్: http://portal.mhrdnats.gov.in/
ఇంటర్వ్యూ
యూహెచ్ క్యాంపస్ స్కూల్‌లో టీచర్ ఉద్యోగాలు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, యూహెచ్ క్యాంపస్ స్కూల్ ఒప్పంద ప్రాతిపదికన 17 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్: 01
2. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్: 13 పోస్టులు
3. ప్రైమరీ టీచర్: 03
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్, డీఈడీ, బీఈడీ, పీజీ, సీటెట్/ టెట్.
వయసు: 65 సంవత్సరాలు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 25-03-2023.
వేదిక: కాలేజ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్టడీస్, సౌత్ క్యాంపస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
వెబ్‌సైట్: https://uohyd.ac.in/
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Vitapu-Botsa: విఠపు పరీక్షలో.. బొత్సకు 2 మార్కులే!
-
Ap-top-news News
AP Assembly: సభాపతి స్థానాన్ని అగౌరవపరిస్తే సస్పెండ్ అయినట్లే.. రూలింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని
-
India News
Property: ఏనుగుల కోసం రూ.5 కోట్ల ఆస్తి
-
India News
మహిళలకు ప్రతీనెలా రూ.వెయ్యి పంపిణీ
-
India News
Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు