నోటిఫికేషన్స్

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌ 52 ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

Published : 25 May 2023 00:25 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

టీహెచ్‌డీసీ ఇండియాలో 52 ట్రెయినీలు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌ 52 ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌/ ఇంజినీరింగ్‌/ బీఎస్సీ ఉత్తీర్ణత.
* గేట్‌లో అర్హత సాధించాలి.
వయసు: 33 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: గేట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.600.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06.06.2023.
వెబ్‌సైట్‌: https://thdc.co.in/new-openings


ఎయిమ్స్‌ రాయ్‌పూర్‌లో  టీచింగ్‌ పోస్టులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌/ డిప్యుటేషన్‌/ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 116 ఫ్యాకల్టీ సభ్యుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  
1. ప్రొఫెసర్‌: 29  
2. అడిషనల్‌ ప్రొఫెసర్‌: 29
3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 38  
4. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 20  
విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్స్‌ తదితరాలు.
విద్యార్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, ఎంసీహెచ్‌తో పాటు పని అనుభవం.
దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌లకు రూ.3,000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16-06-2023.
వెబ్‌సైట్‌: https://www.aiimsraipur.edu.in/index.php


ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌లు

ముంబయిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేట్‌ సెంటర్‌  రెగ్యులర్‌ ప్రాతిపదికన 47 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, మేనేజర్‌ తదితరాలు.
విభాగాలు: సొల్యూషన్‌ ఆర్కిటెక్ట్‌ లీడ్‌, పీఎంవో లీడ్‌, చీఫ్‌ మేనేజర్‌, టెక్‌ ఆర్కిటెక్ట్‌, అబ్జర్వబిలిటీ అండ్‌ మానిటరింగ్‌ స్పెషలిస్ట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏతో పాటు పని అనుభవం.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీలకు రూ.750; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు, రిజిస్ట్రేషన్‌లకు చివరి తేదీ: 05.06.2023.
వెబ్‌సైట్‌: https://sbi.co.in/web/careers/ 


ఎస్‌జేవీఎన్‌ లిమిటెడ్‌లో మేనేజర్‌లు

భారత ప్రభుత్వం, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలోని ఎస్‌జేవీఎన్‌ లిమిటెడ్‌ 51 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: సీనియర్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్లు.
విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సీ అండ్‌ ఐ, కెమికల్‌.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ/ ఎంఎస్సీ.
అనుభవం: 3-14 ఏళ్లు ఉండాలి.
వయసు: 30-45 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.590.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
చిరునామా: O/o DGMs Recruitments, SJVN Limited Shakti Sadan, Corporate Head Quarters, Shanan Shimla, HPn171006.
దరఖాస్తుకు చివరి తేదీ: 12.06.2023.
వెబ్‌సైట్‌: https://sjvn.nic.in/ 


100 ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌,  ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌లు

ప్రభుత్వ రంగ సంస్థ- భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌.. ఫిక్స్‌డ్‌ టర్మ్‌(కాంట్రాక్ట్‌) ప్రాతిపదికన హైదరాబాద్‌, బెంగళూరు, భానూర్‌, విశాఖపట్నం, కొచ్చి, ముంబయిలోని ఉన్న బీడీఎల్‌ కార్యాలయాలు/ యూనిట్లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
* ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ / ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌: 100 పోస్టులు
విభాగాలు: హెచ్‌ఆర్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌, కెమికల్‌, ఎలక్ట్రికల్‌, ఫైనాన్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏతో పాటు పని అనుభవం.
వయసు: 10-05-2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు ఫీజు మినహాయించారు).
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువు: 23-06-2023.
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 05-07-2023.
ఇంటర్వ్యూ తేదీలు: జులై రెండో వారం.
వెబ్‌సైట్‌:https://bdl-india.in/ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని