అణుశక్తి శాఖలో అవకాశాలు

ముంబయిలోని అణుశక్తి శాఖ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ పర్చేస్‌ అండ్‌ స్టోర్స్‌ 62 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Updated : 18 Dec 2023 22:54 IST

ముంబయిలోని అణుశక్తి శాఖ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ పర్చేస్‌ అండ్‌ స్టోర్స్‌ 62 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

నియామకం జరగబోయేవాటిలో జూనియర్‌ పర్చేజ్‌ ఆఫీసర్‌ పోస్టులు 17, జూనియర్‌ స్టోర్‌కీపర్‌ పోస్టులు 45 ఉన్నాయి. మొత్తంలో 62 ఖాళీల్లో.. ఎస్సీలకు 06, ఎస్టీలకు 06, ఓబీసీలకు 20, ఈడబ్ల్యూఎస్‌లకు 05, అన్‌రిజర్వుడ్‌కు 25 కేటాయించారు.

అభ్యర్థులు మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా/ బీఎస్సీ/ బీకామ్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. 31.12.2023 నాటికి ఈ విద్యార్హతలు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి.  

అభ్యర్థుల వయసు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో.. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3, పీడబ్ల్యూబీడీలకు 10-15, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 13-18 ఏళ్ల మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. లెవెల్‌-1లో ఆబ్జెక్టివ్‌ టైప్‌ టెస్ట్‌, లెవెల్‌-2లో డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ ఉంటాయి. లెవెల్‌-1 అర్హత పరీక్ష మాత్రమే. దీంట్లో అర్హత సాధించినవారిని లెవెల్‌-2కు ఎంపిక చేస్తారు.


లెవెల్‌-1

దీంట్లో రాత పరీక్ష ఓఎంఆర్‌ బేస్డ్‌ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. 5 పార్టుల్లో 200 ప్రశ్నలు 200 మార్కులు ఉంటాయి. వ్యవధి 2 గంటలు.

  • పార్ట్‌-ఎ జనరల్‌ ఇంగ్లిష్‌ 50 ప్రశ్నలు.
  • పార్ట్‌-బి (ఎ) జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ ఇన్‌ సైన్స్‌ (12వ తరగతి స్థాయిలోని ప్రాథమికాంశాలు)/ బి) బేసిక్‌ అకౌంటింగ్‌ ప్రిన్సిపల్‌ (12వ తరగతి స్థాయి) - 60 ప్రశ్నలు
  • పార్ట్‌-సి క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (అరిథ్‌మెటిక్‌) - 50 ప్రశ్నలు
  • పార్ట్‌-డి జనరల్‌ నాలెడ్జ్‌ - 20 ప్రశ్నలు
  • కంప్యూటర్‌ నాలెడ్జ్‌ - 20 ప్రశ్నలు
  • సెక్షన్‌-బిలోని (ఎ) లేదా (బి)లను దరఖాస్తు సమయంలోనే ఎంపిక చేసుకోవాలి.
  • పార్ట్‌-ఎలోని ప్రశ్నలు ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటాయి. పార్ట్‌- బి, సి, డి, ఇల్లోని ప్రశ్నలు హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటాయి.

లెవెల్‌-2: రాత పరీక్ష (డిస్క్రిప్టివ్‌ టైప్‌)

ఇది 100 మార్కులకు ఉంటుంది. వ్యవధి 3 గంటలు. రెండు పార్టులు ఉంటాయి.

  • పార్ట్‌-ఎ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌, ప్రెసీ అండ్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌ - 50 మార్కులు. దీన్ని ఇంగ్లిష్‌లో మాత్రమే రాయాలి.
  • పార్ట్‌-బి డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లో ఎస్సే, నోటింగ్‌ అండ్‌ డ్రాఫ్టింగ్‌ - 50 మార్కులు. ఈ భాగాన్ని పూర్తిగా ఇంగ్లిష్‌లోగానీ లేదా హిందీలోగానీ రాయాలి. రెండు భాషలూ ఉపయోగించకూడదు.
  • లెవల్‌-1లో ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు.
  • లెవెల్‌-1లో జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 40 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు 33 శాతం మార్కులు సాధించాలి.
  • లెవెల్‌-2లో జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి.
  • రెండు పరీక్షలను ఒకేరోజున నిర్వహిస్తారు. లెవెల్‌-2లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది జాబితా తయారుచేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులకు 6 నెలల శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో రూ.18,000 స్టైపెండ్‌ + స్టైపెండ్‌ పైన 25 శాతం అకామడేషన్‌, బుక్‌ అలవెన్స్‌గా ఒకేసారి రూ.3000 చెల్లిస్తారు.
  • శిక్షణను విజయవంతంగా పూర్తిచేసినవారిని ఉద్యోగంలో నియమించి.. లెవెల్‌-4 కింద నెలకు రూ.25,500 వేతనం చెల్లిస్తారు. దీంతోపాటు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇతర ప్రోత్సాహకాలూ ఉంటాయి.


తయారవ్వాలంటే..

వివిధ పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారా.. జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (అరిథ్‌మెటిక్‌), జనరల్‌ నాలెడ్జ్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌.. మొదలైన అంశాలపై పట్టు సాధించవచ్చు.

  • ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే మాక్‌ టెస్ట్‌లను రాస్తూ సన్నద్ధతను పరీక్షించుకోవచ్చు. బలహీనంగా ఉన్న అంశాలపై అదనపు సమయాన్ని కేటాయించాలి.
  • నిర్ణీత సమయంలోనే సమాధానాలు రాయడాన్ని సాధన చేయాలి. దీంతో ఏ ప్రశ్ననూ వదలకుండా అన్నింటికీ సమాధానాలు రాయగలుగుతారు.
  • నెగిటివ్‌ మార్కులు ఉన్నాయి కాబట్టి పూర్తిగా తెలిసిన ప్రశ్నలకే సమాధానాలు రాయాలి.  
  • లెవెల్‌-2లోని ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌, ప్రెసీ అండ్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌.. కోసం మార్కెట్లో అందుబాటులో ఉండే వివిధ పోటీ పరీక్షల పుస్తకాలు ఉపయోగపడతాయి. విషయాన్ని అర్థం చేసుకుంటూ చదవడం.. పేరాలోని ముఖ్యాంశాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. రోజూ ఇంగ్లిష్‌ వార్తాపత్రిక చదవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 31.12.2023

లెవెల్‌-1, 2 పరీక్షలు: జనవరి మూడో వారం, 2024

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ఇందౌర్‌, బెంగళూరు, చండీగఢ్‌, గువాహటి, నాగ్‌పుర్‌.  

వెబ్‌సైట్‌: https://dpsdae.formflix.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని