ఎన్‌టీఆర్‌ఓలో చేరతారా?

నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌టీఆర్‌ఓ)  74 సైంటిస్ట్‌ ‘బి’ జనరల్‌ సెంట్రల్‌ సివిల్‌ సర్వీస్‌, గ్రూప్‌-ఎ (గెజిటెడ్‌, నాన్‌-మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated : 01 Jan 2024 05:32 IST

74 సైంటిస్ట్‌ పోస్టులు 

నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌టీఆర్‌ఓ)  74 సైంటిస్ట్‌ ‘బి’ జనరల్‌ సెంట్రల్‌ సివిల్‌ సర్వీస్‌, గ్రూప్‌-ఎ (గెజిటెడ్‌, నాన్‌-మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 74 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 22, ఎస్సీకి 14, ఎస్టీకి 06, ఓబీసీకి 27, ఈడబ్ల్యూఎస్‌లకు 05 కేటాయించారు.

1. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌: 35 ఖాళీలు. ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌/ అప్లైడ్‌ ఎలక్ట్రానిక్స్‌/ రేడియో ఫిజిక్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ మేథమెటిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ప్రథమశ్రేణిలో పాసవ్వాలి. లేదా ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ పవర్‌/ టెలికమ్యూనికేషన్‌/ కమ్యూనికేషన్‌ ఆప్టిక్స్‌లో డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం, గేట్‌ స్కోరు ఉండాలి.

2. కంప్యూటర్‌ సైన్స్‌: 33 ఖాళీలు. గణితంలో ప్రథమశ్రేణి మాస్టర్స్‌ డిగ్రీ లేదా ఇంజినీరింగ్‌/ టెక్నాలజీలో ప్రథమ శ్రేణి బ్యాచిలర్స్‌ డిగ్రీ పాసవ్వాలి. గేట్‌ స్కోరు, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.

3. జియో-ఇన్‌ఫర్మాటిక్స్‌ అండ్‌ రిమోట్‌ సెన్సింగ్‌: 06 ఖాళీలు. జియో-ఇన్‌ఫర్మాటిక్స్‌/ రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ జియో ఇన్‌ఫర్మాటిక్స్‌ లేదా మేథమెటిక్స్‌లో ఫస్ట్‌క్లాస్‌ మాస్టర్స్‌ డిగ్రీ పాసవ్వాలి. లేదా ఇంజినీరింగ్‌/ టెక్నాలజీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ప్రథమ శ్రేణిలో పాసవ్వాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం, గేట్‌ స్కోరు ఉండాలి.  

అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో.. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 5 ఏళ్లు, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు  5 ఏళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.250 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

రెండు దశల్లో ...

అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. స్టేజ్‌-1లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఆబ్జెక్టివ్‌/ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటుంది. స్టేజ్‌-2లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.  

  • రాత పరీక్షలో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ప్రశ్నకు 2 మార్కుల చొప్పున కేటాయించారు. వ్యవధి 120 నిమిషాలు (2 గంటలు).
  • ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.
  • ప్రతి తప్పు సమాధానానికీ 0.5 మార్కు తగ్గిస్తారు. సమాధానాలు రాయకుండా వదిలేసిన వాటికి మార్కులు తగ్గించరు.
  • స్టేజ్‌-1లోని రాత పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
  • ఇంటర్వ్యూకు 50 మార్కులు కేటాయించారు.
  • రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను 1:4 నిష్పత్తిలో ఎంపిక చేసి న్యూదిల్లీలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
  • రాత పరీక్షలో అన్‌రిజర్వుడ్‌ అభ్యర్థులు 50 శాతం, రిజర్వుడ్‌ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి.
  • గేట్‌స్కోర్‌కు 50 శాతం, రాత పరీక్షకు 30 శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
  • రాత పరీక్ష ఫిబ్రవరి 2024లో జరిగే అవకాశం ఉంది. దీంట్లో మార్పు ఉంటే వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులకు 2 సంవత్సరాల ప్రొబేషన్‌ ఉంటుంది.
  • రాత పరీక్షలో సిలబస్‌ సంబంధిత ప్రశ్నలే వస్తాయి. కాబట్టి సబ్జెక్టులపై గట్టి పట్టు సాధించాలి.
  • వెబ్‌సైట్‌లో ప్రకటించిన సిలబస్‌లోని అంశాలను క్షుణ్ణంగా చదవాలి.  
  • మూల వేతనం రూ.56,100 ఉంటుంది. దీనికి అదనంగా డీఏ, స్పెషల్‌ సెక్యూరిటీ అలవెన్స్‌, ఇంటి అద్దె అలవెన్స్‌, రవాణా అలవెన్స్‌.. మొదలైన ప్రోత్సాహకాలు ఉంటాయి. వీటికి అదనంగా ఏటా ఇంక్రిమెంట్‌, ఉద్యోగికీ, కుటుంబ సభ్యులకూ వైద్య సదుపాయాలు, ఎల్‌టీసీ, ఉద్యోగి పిల్లల చదువుకు అలవెన్స్‌, వసతి సదుపాయాలూ ఉంటాయి.

గమనించాల్సినవి

  • అభ్యర్థులు ప్రస్తుతం ఉపయోగిస్తోన్న ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్లను మాత్రమే దరఖాస్తులో రాయాలి.
  • 19.01.2024 నాటికి సంబంధిత విద్యార్హతలు, కుల, ఆదాయ సర్టిఫికెట్లు సిద్ధంగా ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి.
  • దరఖాస్తును సమర్పించాక ప్రింటవుట్‌ తీసుకుని భద్రపరుచుకోవాలి.
  • ఒక దరఖాస్తును మాత్రమే పంపాలి. ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు పంపితే.. చివరగా పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

రాత పరీక్ష కేంద్రాలు: గువాహటి, న్యూదిల్లీ, బెంగళూరు, ముంబయి, లక్నో, కోల్‌కతా.
దరఖాస్తుకు చివరి తేదీ: 19.01.2023
వెబ్‌సైట్‌:  https://recruit-ndl.nielit.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని