ఆయిల్‌ ఇండియాలో ఉపాధి అవకాశాలు

అస్సాంలోని ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ (ఓఐఎల్‌) 102 గ్రేడ్‌-ఏ, బీ, సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ, ప్రొఫిషియన్సీ టెస్ట్‌/ స్కిల్‌ టెస్ట్‌/ ధ్రువపత్రాల పరిశీలన/ వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  

Updated : 18 Jan 2024 04:38 IST

ఎవరు అర్హులు? ఎన్ని ఖాళీలు?

 

అస్సాంలోని ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ (ఓఐఎల్‌) 102 గ్రేడ్‌-ఏ, బీ, సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ, ప్రొఫిషియన్సీ టెస్ట్‌/ స్కిల్‌ టెస్ట్‌/ ధ్రువపత్రాల పరిశీలన/ వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  

గ్రేడ్‌-సీ అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. ఫేజ్‌-1లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు 100 మార్కులు. దీంట్లో జనరల్‌ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి. ఫేజ్‌-2లో పర్సనల్‌ ఇంటర్యూకు 15 మార్కులు. ఇది అర్హత పరీక్ష మాత్రమే.

  •  గ్రేడ్‌-బీ అభ్యర్థులకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ 100 మార్కులకు ఉంటుంది. దీంట్లో జనరల్‌ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి. ఫేజ్‌-2లోని పర్సనల్‌ ఇంటర్యూకు 15 మార్కులు. ఇది అర్హత పరీక్ష మాత్రమే.
  •  కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) వ్యవధి గంటన్నర. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
  • సీబీటీలోని ప్రశ్నలు సిలబస్‌ ఆధారంగా ఉంటాయి. కాబట్టి చదివిన సబ్జెక్టులోని ముఖ్యాంశాలపై గట్టి పట్టు సాధించాలి.
  •  గ్రేడ్‌-ఏలోని పోస్టుకు ఫేజ్‌-1లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. జనరల్‌ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి. దీంట్లో అర్హత సాధించినవారిని 1:2 నిష్పత్తిలో స్కిల్‌టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. గ్రేడ్‌-2లోని ప్రొఫిషియన్సీ టెస్ట్‌/ స్కిల్‌ టెస్ట్‌లో 100 మార్కులకు 50 మార్కులు సంపాదించాలి. స్కిల్‌ టెస్ట్‌ అనేది అర్హత పరీక్ష మాత్రమే.
  •  ఇంటర్వ్యూ సమయంలో ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
  •  ఎంపికైన అభ్యర్థులను దేశంలోని ఐఓఎల్‌ యూనిట్లలో ఎక్కడైనా నియమిస్తారు. బదిలీలూ ఉంటాయి.
  •  ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రిజర్వేషన్లు/ సడలింపులు ఉంటాయి.

గ్రేడ్‌-సి: సూపరింటెండింగ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (ఆర్థోపెడిక్స్‌): 1. ఎంఎస్‌ ఆర్థోపెడిక్స్‌ చేసివుండాలి. గరిష్ఠ వయసు 40 ఏళ్లు.
సూపరింటెండింగ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (రేడియాలజీ): 1. ఎండీ రేడియో డయాగ్నోసిస్‌ పూర్తిచేయాలి. గరిష్ఠ వయసు 37 సంవత్సరాలు.
సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ (ఎన్విరాన్‌మెంట్‌): 2. ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ 65 శాతం మార్కులతో పాసవ్వాలి/ ఏదైనా ఇంజినీరింగ్‌ డిగ్రీ పాసై నాలుగేళ్ల అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు.
గ్రేడ్‌-బి: సీనియర్‌ ఆఫీసర్‌ (కెమికల్‌): 2. కెమిస్ట్రీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. గరిష్ఠ వయసు 29 ఏళ్లు.
సీనియర్‌ ఆఫీసర్‌ (ఎలక్ట్రికల్‌): 10. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ 65 శాతం మార్కులతో పాసవ్వాలి. గరిష్ఠ వయసు 27 సం.
సీనియర్‌ ఆఫీసర్‌ (ఫైర్‌ అండ్‌ సేఫ్టీ): 11. ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌ 65 శాతం మార్కులతో పాసవ్వాలి. గరిష్ఠ వయసు 27 ఏళ్లు.  
సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ / సీనియర్‌ ఇంటర్నల్‌ ఆడిటర్‌: 11. ఐసీఏఐ/ ఐసీఎంఏఐలో అసోసియేట్‌ సభ్యుడై ఉండాలి. గరిష్ఠ వయసు 29 సం.
సీనియర్‌ ఆఫీసర్‌ మెకానికల్‌: 41. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ 65 శాతం మార్కులతో పాసవ్వాలి. గరిష్ఠ వయసు 27 ఏళ్లు.  
సీనియర్‌ ఆఫీసర్‌ (ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ): 3. కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ ఇంజినీరింగ్‌ డిగ్రీ 65 శాతం మార్కులతో పాసవ్వాలి. గరిష్ఠ వయసు 27 సం.
సీనియర్‌ ఆఫీసర్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌): 6. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ 65 శాతం మార్కులతో పాసవ్వాలి. గరిష్ఠ వయసు 27 ఏళ్లు.  
సీనియర్‌ ఆఫీసర్‌ (పెట్రోలియం): 5. పెట్రోలియం ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. గరిష్ఠ వయసు 29 సం.
సీనియర్‌ జియాలజిస్ట్‌: 3. జియాలజీ/ అప్లైడ్‌ జియాలజీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. గరిష్ఠ వయసు 32 ఏళ్లు.
సీనియర్‌ ఆఫీసర్‌ (హెచ్‌ఆర్‌): 3. ఎంబీఏ (హెచ్‌ఆర్‌) 60 శాతం మార్కులతో పాసవ్వాలి. గరిష్ఠ వయసు 32 సం.
సీనియర్‌ ఆఫీసర్‌ (హెచ్‌ఎస్‌ఈ): 2. ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ 65 శాతం మార్కులతో పాసవ్వాలి. గరిష్ఠ వయసు 32 ఏళ్లు  
గ్రేడ్‌-ఎ: కాన్ఫిడెన్షియల్‌ సెక్రటరీ: 1. షార్ట్‌హ్యాండ్‌లో నైపుణ్యం, ప్రభుత్వ/ పబ్లిక్‌/ ప్రైవేటు రంగంలో రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. ఈ పోస్టును దివ్యాంగులకు కేటాయించారు.గరిష్ఠ వయసు కేటగిరీని బట్టి 40-45 సంవత్సరాలు.  
దరఖాస్తు ఫీజు జనరల్‌/ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు రూ.500 + ట్యాక్సులు అదనం. ఎస్సీ/ ఎస్టీ/  పీడబ్ల్యూబీడీ/ ఈడబ్ల్యూఎస్‌/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తుకు చివరి తేదీ: 29.01.2024
వెబ్‌సైట్‌: http://www.oil-india.com/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని