సీఆర్‌పీఎఫ్‌లో అవకాశాలు

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) స్పోర్ట్స్‌ కోటా కింద గ్రూప్‌-సి విభాగంలో కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) నాన్‌-గెజిటెడ్‌ అండ్‌ నాన్‌ మినిస్టీరియల్‌ 169 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 22 Jan 2024 00:08 IST

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) స్పోర్ట్స్‌ కోటా కింద గ్రూప్‌-సి విభాగంలో కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) నాన్‌-గెజిటెడ్‌ అండ్‌ నాన్‌ మినిస్టీరియల్‌ 169 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన  అభ్యర్థులు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విధులు నిర్విర్తించే అవకాశం పొందవచ్చు.

క్రీడా ప్రదర్శన, స్పోర్ట్స్‌ ట్రయల్‌ టెస్ట్‌, వైద్య పరీక్షలు, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 1.1.2021 నుంచి 31.12.23 మధ్య వివిధ క్రీడల్లో పాల్గొని.. పొందిన పతకాల ఆధారంగా మార్కులు ఇస్తారు.

క్రీడా విభాగాలు: జిమ్నాస్టిక్స్‌, జూడో, వుషు, షూటింగ్‌, బాక్సింగ్‌, అథ్లెటిక్స్‌, ఆర్చరీ, రెజ్లింగ్‌ ఫ్రీ స్టైల్‌, గ్రీకో రోమన్‌, తైక్వాండో, వాటర్‌ స్పోర్ట్స్‌ కయాక్‌, కానో, రోయింగ్‌, బాడీబిల్డింగ్‌, వెయిల్‌లిఫ్టింగ్‌, స్విమ్మింగ్‌, ట్రత్లాన్‌, డైవింగ్‌, డైవింగ్‌ ఈక్వెస్ట్రియన్‌, యాచింగ్‌, ఐస్‌ హాకీ, ఐస్‌ స్కేటింగ్‌, ఐస్‌ స్కీయింగ్‌.

మొత్తం 169 ఉద్యోగాల్లో మహిళలకు 86, పురుషులకు 83 కేటాయించారు. దరఖాస్తు రుసుము రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎవరు అర్హులు?

అభ్యర్థులు పదోతరగతి పాసై, నిర్దిష్ట శారీరక దార్ఢ్యంతోపాటు సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించాలి. 15.02.2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో జనరల్‌ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 10 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 8 ఏళ్లు, డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.

శారీరక ప్రమాణాలు

పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ., ఛాతీ 80 సెం.మీ. ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి.  మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెం.మీ. ఉండాలి.  

  • ఎస్సీ, ఎస్టీ పురుష అభ్యర్థుల ఎత్తు 162 సెం.మీ., ఛాతీ 76 సెం.మీ. ఉండాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు 150 సెం.మీ. ఉండాలి.
  • అభ్యర్థులకు వర్ణ అంధత్వం, ఇతర దృష్టి సంబంధిత సమస్యలు ఏమీ ఉండకూడదు.

01.01.2021 నుంచి 31.12.2023 వరకూ జరిగిన వివిధ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన అభ్యర్థులకు అడ్మిట్‌ కార్డులు జారీచేస్తారు. తర్వాత వీరికి ధ్రువపత్రాల పరిశీలన, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ), డీటెయిల్డ్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌, రివ్యూ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించి.. అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  
దరఖాస్తుకు చివరి తేదీ: 15.02.2024

వెబ్‌సైట్‌: https://recruitment.crpf.gov.in/

మార్కుల కేటాయింపు

వివిధ క్రీడా పోటీల్లో సాధించిన పతకాలను బట్టి మార్కులు ఇస్తారు.

ఒలింపిక్‌ గేమ్స్‌/ సమ్మర్‌/ వింటర్‌ పోటీలు: బంగారు పతకానికి 100, వెండికి 96, కాంస్యానికి 92, పాల్గొన్నవారికి 80 మార్కులు ఇస్తారు.
వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌/ వరల్డ్‌ కప్‌: బంగారుకు 90, వెండి 86, కాంస్యానికి 82, పాల్గొంటే 70 మార్కులు.
ఏషియన్‌ గేమ్స్‌/ కామెన్‌వెల్త్‌ గేమ్స్‌ (4 ఏళ్లు): బంగారుకు 80, వెండికి 76, కాంస్యానికి 72, పాల్గొంటే 60 మార్కులు.
ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌/ కప్‌/ కామన్‌వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌: బంగారుకు 70, వెండికి 66, కాంస్యానికి 62, పాల్గొంటే 50 మార్కులు.
యూత్‌ ఒలింపిక్‌ గేమ్స్‌: బంగారుకు 60, వెండికి 56, కాంస్యానికి 52, పాల్గొంటే 40 మార్కులు.
యూత్‌/జూనియర్‌ ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌ అండ్‌ యూత్‌/ జూనియర్‌ కామన్‌వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌: బంగారుకు 50, వెండికి 46, కాంస్యానికి 42, పాల్గొంటే 30 మార్కులు.
సాఫ్‌ గేమ్‌, ఇతర అంతర్జాతీయ పోటీలు: బంగారుకు 40, వెండికి 36, కాంస్యానికి 32, పాల్గొంటే 26 మార్కులు.
నేషనల్‌ గేమ్స్‌, సీనియర్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ ఇండివిడ్యువల్‌ మెడల్‌ విభాగం: బంగారుకు 30, వెండికి 26, పాల్గొంటే 22 మార్కులు.
టీమ్‌ మెడల్‌ ఇన్‌ ఇండివిడ్యుయల్‌ స్పోర్ట్స్‌: బంగారుకు 26, వెండికి 22, కాంస్యానికి 18 మార్కులు.
యూత్‌/ జూనియర్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ ఇండివిడ్యువల్‌ మెడల్‌: బంగారుకు 20, వెండికి 16, కాంస్యానికి 12 మార్కులు.
టీమ్‌ మెడల్‌ ఇన్‌ ఇండివిడ్యువల్‌ స్పోర్ట్స్‌: బంగారుకు 16, వెండికి 12, కాంస్యానికి 8 మార్కులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని