నాల్కోలో కొలువులు

నవరత్న, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ (నాల్కో)లోని బొగ్గు గనుల విభాగం 42 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్‌ ఫోర్‌మెన్‌,   ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, నర్స్‌.. మొదలైన ఉద్యోగాలు ఉన్నాయి.

Updated : 05 Feb 2024 04:58 IST

నవరత్న, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ (నాల్కో)లోని బొగ్గు గనుల విభాగం 42 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్‌ ఫోర్‌మెన్‌,   ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, నర్స్‌.. మొదలైన ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ప్రకటించిన పోస్టుల్లో.. వివిధ విభాగాలకు చెందిన జూనియర్‌ ఫోర్‌మెన్‌ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

  • ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3, డ్రస్సర్‌ కమ్‌ ఫస్ట్‌ ఎయిడర్‌, నర్స్‌ గ్రేడ్‌-3 పోస్టులకు రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ రెండూ నిర్వహిస్తారు.
  • రాత పరీక్షకు 60 శాతం, ట్రేడ్‌ టెస్ట్‌కు 40 శాతం వెయిటేజి ఉంటుంది.
  • రాత, ట్రేడ్‌ పరీక్షల్లో చూపిన ప్రతిభ,  వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.

ఏ పోస్టులు ఎన్ని? ఎవరు అర్హులు?

జూనియర్‌ ఫోర్‌మెన్‌ (షార్ట్‌ ఫైర్‌ బ్లాస్టర్‌): 02. మైనింగ్‌/ మైనింగ్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసవ్వాలి. సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి. వయసు 40 సంవత్సరాలు మించకూడదు.

ఓవర్‌మెన్‌/ మైన్స్‌: 18. మైనింగ్‌/ మైనింగ్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసవ్వాలి. సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి. గరిష్ఠ వయసు 40 ఏళ్లు.

ఎలక్ట్రికల్‌: 05.ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ ఫుల్‌టైమ్‌ రెగ్యులర్‌ డిప్లొమా పూర్తిచేయాలి. సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి. వయసు 40 ఏళ్లు మించకూడదు.

సర్వేయర్‌: 05. మైనింగ్‌/ మైనింగ్‌ ఇంజినీరింగ్‌/ తత్సమాన డిప్లొమా పాసవ్వాలి. సర్వేయర్స్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి. గరిష్ఠ వయసు 40 సంవత్సరాలు.  

సివిల్‌: 02. సివిల్‌ ఇంజినీరింగ్‌ ఫుల్‌టైమ్‌ రెగ్యులర్‌ డిప్లొమా పూర్తిచేయాలి. వయసు 40 ఏళ్లు మించకూడదు.

ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3: 2. కెమిస్ట్రీతో బీఎస్సీ (ఆనర్స్‌) పాసవ్వాలి. గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు.

డ్రస్సర్‌ కమ్‌ ఫస్ట్‌ ఎయిడర్‌: 04.హెచ్‌ఎస్‌సీ పాసవడంతోపాటు ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. ఆసుపత్రి/ డిస్పెన్సరీలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకూడదు.

నర్స్‌ గ్రేడ్‌-3: 04. సైన్స్‌ సబ్జెక్టుతో 10+2 పాసవడంతోపాటు మూడేళ్ల జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ శిక్షణ పూర్తిచేయాలి. స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు.

  • ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, నర్స్‌ పోస్టులకు ఏడాది అనుభవం సరిపోతుంది. మిగతా అన్ని పోస్టులకూ రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
  • గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వ తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. నాల్కో సంస్థ ఉద్యోగులకు గరిష్ఠ వయసు లేదు.
  • జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌/ నాల్కో కంపెనీ ఉద్యోగులకు ఫీజు లేదు.
  • ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనంతోపాటుగా.. సెలవులు, పెర్క్స్‌, నైట్‌ షిఫ్ట్‌ అలవెన్స్‌, కంపెనీ వసతి/ హెచ్‌ఆర్‌ఏ, జిఐఎస్‌, పీఎఫ్‌, గ్రాట్యుటీ.. మొదలైన సదుపాయాలన్నీ ఉంటాయి.

గమనించండి..

  • అభ్యర్థులు ప్రస్తుతం వినియోగిస్తోన్న ఈమెయిల్‌ ఐడీని మాత్రమే దరఖాస్తులో రాయాలి. ఉద్యోగ సమాచారాన్ని దీనికే తెలియజేస్తారు. దీన్ని మరో ఏడాదిపాటు మార్చకూడదు.
  • తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శిస్తుండాలి.
  • ప్రభుత్వ/ పీఎస్‌యూల్లో పనిచేసే అభ్యర్థులు రాత పరీక్ష సమయంలో తప్పనిసరిగా ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను సమర్పించాలి.
  • రాత పరీక్షకు హాజరయ్యే ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రెండో తరగతి ప్రయాణ ఛార్జీలను చెల్లిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18.02.2024
డాక్యుమెంట్లు, హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేదీ: 26.02.2024
వెబ్‌సైట్‌: http://www.nalcoindia.com/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని