నోటిఫికేషన్స్‌

ఏలూరులోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 07 Feb 2024 00:03 IST

ఉద్యోగాలు

ఏలూరు జిల్లాలో బ్లాక్‌ కోఆర్డినేటర్‌, సోషల్‌ వర్కర్‌లు

ఏలూరులోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీలు: బ్లాక్‌ కోఆర్డినేటర్‌, లీగల్‌ కమ్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌, సోషల్‌ వర్కర్‌, అవుట్‌రీచ్‌ వర్కర్‌, సోషల్‌ వర్కర్‌ కమ్‌ ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ ఎడ్యుకేటర్‌, డాక్టర్‌, చౌకీదార్‌, పారా లీగల్‌ పర్సనల్‌ లాయర్‌.
విద్యార్హత: ఇంటర్‌, డిగ్రీ, ఎల్‌ఎల్‌బీతో పాటు పని అనుభవం.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, కలెక్టరేట్‌, ఏలూరు’ చిరునామాకు పంపించాలి.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-02-2024.

వెబ్‌సైట్‌: https://eluru.ap.gov.in/


వాక్‌-ఇన్‌

నిర్ట్‌, చెన్నైలో 32 ప్రాజెక్ట్‌ పోస్టులు

చెన్నైలోని ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ తాత్కాలిక ప్రాతిపదికన 27 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-ఖిఖి (మెడికల్‌): 2
  • ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-ఖిఖి (మెడికల్‌) (సర్వే మానిటర్‌): 1
  • ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-ఖిఖి (ల్యాబొరేటరీ టెక్నీషియన్‌): 13
  • ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-ఖి (హెల్త్‌ అసిస్టెంట్‌): 11

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, ఎంబీబీఎస్‌, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం.
వాక్‌-ఇన్‌ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తేదీ: 12.02.2024, 13.02.2024.
స్థలం: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ట్యూబర్‌క్యులోసిస్‌, నెం.1, మేయర్‌ సత్యమూర్తి రోడ్‌, చెట్‌పేట్‌, చెన్నై.

వెబ్‌సైట్‌: https://www.nirt.res.in/


ప్రవేశాలు

ఐఐఎం విశాఖపట్నంలో పీహెచ్‌డీ

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎంవీ)- 2024-25 విద్యాసంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: డెసిషన్‌ సైన్సెస్‌, ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, మేనేజ్‌మెంట్‌ కమ్యూనికేషన్‌, మార్కెటింగ్‌, ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొడక్షన్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజీ.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్‌.
వ్యవధి: గరిష్ఠంగా అయిదేళ్లు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21-03-2024.

వెబ్‌సైట్‌: https://iimv.ac.in/  programs/phd-abt-prgm


సెంట్రల్‌ వర్సిటీలో డిప్లొమాలు

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ వర్చువల్‌ లెర్నింగ్‌ 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

డిప్లొమాల వివరాలు

1. లైబ్రరీ ఆటోమేషన్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌
2. సైబర్‌ లాస్‌ అండ్‌ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌
3. కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌
4. క్రిమినల్‌ జస్టిస్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌
5. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌
6. ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌
7. పంచాయత్‌ రాజ్‌ గవర్నెన్స్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌
8. ఇన్పెక్షన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌
9. కమ్యూనిటీ ఐ హెల్త్‌
10. టెలికాం టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ.
కోర్సు వ్యవధి: ఏడాది.
రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.300.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29-02-2024.

వెబ్‌సైట్‌: https://cdvl.uohyd.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు