ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌లో టెక్నీషియన్‌ కొలువులు

దిల్లీలోని ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌, రిపేరింగ్‌ సంస్థ.. ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌) 100 ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌, టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 15 Feb 2024 00:03 IST

దిల్లీలోని ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌, రిపేరింగ్‌ సంస్థ.. ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌) 100 ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌, టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులను ముందు 5 ఏళ్ల ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ కింద ఉద్యోగంలోకి తీసుకుంటారు. పనితీరు, సంస్థ అవసరాల ఆధారంగా కాంట్రాక్ట్‌ను మరో 5 ఏళ్లపాటు పొడిగించే అవకాశం ఉంటుంది. దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో పంపాలి.

స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌, టెక్నికల్‌ అసెస్‌మెంట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

  • అర్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ను తయారుచేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ తేదీ, సమయాలను అభ్యర్థుల ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్లకు
  • తెలియజేస్తారు.
  • స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ సమయంలో అభ్యర్థుల ఒరిజినల్‌ డాక్యుమెంట్లను పరిశీలిస్తారు.
  • గవర్నమెంట్‌/ సెమీ-గవర్నమెంట్‌/ ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే అభ్యర్థులు ప్రాపర్‌ ఛానల్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. లేదా ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను సమర్పించాలి.
  • స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

ఏ పోస్టుకు ఎవరు అర్హులు?

1. ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌: ఏఎంఈ డిప్లొమా/ సర్టిఫికెట్‌ ఇన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ (మెకానికల్‌) ఇంజినీరింగ్‌ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉండాలి.
లేదా మెకానికల్‌/ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు సరిపోతాయి.

ఏడాది పని అనుభవం తప్పనిసరి.

2. ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌ (ఏవియానిక్స్‌/ ఎలక్ట్రికల్‌/ ఇన్‌స్ట్రుమెంటల్‌/ రేడియో): ఏఎంఈ డిప్లొమా/ సర్టిఫికెట్‌ ఇన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌ (ఏవియానిక్స్‌) జనరల్‌ అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాసవ్వాలి. లేదా ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ టెలికమ్యూనికేషన్‌/ రేడియో/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా జనరల్‌ అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాసవ్వాలి.
3. టెక్నీషియన్‌- ఫిట్టర్‌/ షీట్‌ మెటల్‌, కార్పెంటర్‌, వెల్డర్‌: సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేయాలి. 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
4. టెక్నీషియన్‌ - ఎక్స్‌రే/ ఎన్‌డీటీ: బీఎస్సీ (ఫిజిక్స్‌) లేదా డిప్లొమా ఇన్‌ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ లేదా బీటెక్‌ ఇన్‌ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ పాసవ్వాలి.

01.02.2024 నాటికి జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఎక్స్‌ - సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వ తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1000. దీన్ని ఆర్‌టీజీఎస్‌/ ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా చెల్లించాలి.

  • సంస్థ వెబ్‌సైట్‌ నుంచి అప్లికేషన్‌ ప్రింట్‌ అవుట్‌ తీసుకుని పూరించాలి. దానికి సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి ఆఫ్‌లైన్‌లో పంపాలి.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రెండో తరగతి ప్రయాణ ఛార్జీలను చెల్లిస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులను దిల్లీతోపాటు దేశంలోని ఏఐఈఎస్‌ఎల్‌ కార్యాలయాల్లో ఎక్కడైనా నియమించే అవకాశం ఉంటుంది.  

దరఖాస్తుకు చివరి తేదీ: 23.02.2024
వెబ్‌సైట్‌: www.aiesl.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని