నోటిఫికేషన్స్‌

ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌- తాత్కాలిక ప్రాతిపదికన 34 ప్రాజెక్టు ఇంజినీర్‌-ఖి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 19 Feb 2024 00:53 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

బెల్‌, ఘజియాబాద్‌లో ప్రాజెక్టు ఇంజినీర్‌లు

జియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌- తాత్కాలిక ప్రాతిపదికన 34 ప్రాజెక్టు ఇంజినీర్‌-ఖి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌ ఇంజినీరింగ్‌ (కంప్యూటర్‌ సైన్స్‌)తో పాటు రెండేళ్ల పని అనుభవం.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.55,000 వరకు.
వయసు: 32 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.472. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01-03-2024.
వెబ్‌సైట్‌: https://bel-india.in/


నిడ్‌, అహ్మదాబాద్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌లు

హ్మదాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (నిడ్‌)- డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. డిజైన్‌ అసిస్టెంట్‌: 01  
2. టెక్నికల్‌ అసిస్టెంట్‌: 02  
3. సీనియర్‌ అసిస్టెంట్‌: 02  

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం.
వయసు: డిజైన్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌లకు 30 ఏళ్లు, సీనియర్‌ అసిస్టెంట్‌కు 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: డిజైన్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌లకు నెలకు రూ.25,500 - రూ.81,100; సీనియర్‌ అసిస్టెంట్‌కు నెలకు రూ.29,200 - రూ.92,300.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11-03-2024
వెబ్‌సైట్‌: https://www.nid.edu/home


వాక్‌ఇన్‌

గోల్కొండ కేంద్రీయ విద్యాలయలో టీచింగ్‌ స్టాఫ్‌

గోల్కొండలోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ.. కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు కోరుతోంది.

1. పీజీటీ: ఇంగ్లిష్‌, హిందీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఎకనామిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, జాగ్రఫీ, కామర్స్‌
2. టీజీటీ: ఇంగ్లిష్‌, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ సైన్స్‌.
3. పీఆర్‌టీ
4. కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, స్పోర్ట్స్‌ కోచ్‌, డ్యాన్స్‌ కోచ్‌, ఎడ్యుకేషనల్‌ కౌన్సెలర్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌, నర్స్‌

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, బీఈడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా.
ఇంటర్వ్యూ తేదీలు: 20-02-2024, 24-02-2024.
ప్రదేశం: పీఎంశ్రీ కేవీ నెం.1, గోల్కొండ.
వెబ్‌సైట్‌: https://no1golconda.kvs.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని