నోటిఫికేషన్స్‌

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. వివిధ విభాగాల్లో మొత్తం 9,000 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.

Updated : 20 Feb 2024 01:13 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

రైల్వేలో 9,000 టెక్నీషియన్‌ పోస్టులు   

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. వివిధ విభాగాల్లో మొత్తం 9,000 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.

  • టెక్నీషియన్‌ గ్రేడ్‌-ఖి సిగ్నల్‌: 1,100  
  • టెక్నీషియన్‌ గ్రేడ్‌-ఖిఖిఖి: 7,900

వయసు: 01-07-2024 నాటికి టెక్నీషియన్‌ గ్రేడ్‌-ఖి సిగ్నల్‌ పోస్టులకు 18-36 ఏళ్లు; టెక్నీషియన్‌ గ్రేడ్‌-ఖిఖిఖి పోస్టులకు 18-33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.
ఎంపిక: ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 09-03-2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 08-04-2024.
గమనిక: రీజియన్ల వారీ ఖాళీలు, విద్యార్హత, రాత పరీక్ష, సిలబస్‌ తదితర పూర్తి వివరాలు త్వరలో విడుదలకానున్నాయి.

వెబ్‌సైట్‌: https://indianrailways.gov.in/


ఏపీలో అసిస్టెంట్‌ కెమిస్ట్‌లు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏపీ గ్రౌండ్‌ వాటర్‌ సర్వీసులో 4 అసిస్టెంట్‌ కెమిస్ట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

అర్హత: ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ అప్లైడ్‌ కెమిస్ట్రీ) లేదా డిగ్రీ (కెమికల్‌ ఇంజినీరింగ్‌/ కెమికల్‌ టెక్నాలజీ).
వయసు: 01/07/2024 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.370. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.250.
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 01/04/2024 నుంచి 21/04/2024 వరకు.

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/


లైబ్రేరియన్‌ కొలువులు

ఏపీపీఎస్‌సీ ఏపీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సబార్డినేట్‌ సర్వీసులో 4 లైబ్రేరియన్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: మొదటి లేదా ద్వితీయ శ్రేణిలో ఎంఏ/ ఎంఎస్సీ/ ఎంకాం, ఎంఎల్‌ఐఎస్సీ. డిగ్రీ (బయాలజీ), కంప్యూటరైజ్డ్‌ డేటాబేస్‌ పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు.
వయసు: 01/07/2024 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.370. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.250.
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 27/03/2024 నుంచి 16/04/2024 వరకు.

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/


ప్రవేశాలు

ట్రిపుల్‌ఐటీలో డ్యూయల్‌ డిగ్రీ

హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ- డ్యూయల్‌ డిగ్రీ (బీటెక్‌, ఎంఎస్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. యూజీఈఈ 2024 ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు.

మొత్తం సీట్ల సంఖ్య: 105.
ప్రోగ్రామ్‌ వ్యవధి: అయిదేళ్లు.
బీటెక్‌: ఎలక్టాన్రిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌
ఎంఎస్‌ (రిసెర్చ్‌): ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, కంప్యుటేషనల్‌ లింగ్విస్టిక్స్‌, కంప్యుటేషనల్‌ నేచురల్‌ సైన్సెస్‌, కంప్యూటింగ్‌ అండ్‌ హ్యూమన్‌ సైన్సెస్‌.
అర్హత: జూన్‌ 2024 నాటికి మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణత. ఎంపిక: యూజీఈఈ 2024, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.2,500. మహిళలకు రూ.1250.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01-04-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 04-05-2024.
ఇంటర్వ్యూ తేదీలు: 11 నుంచి 13-06-2024 వరకు.  

వెబ్‌సైట్‌: https://ugadmissions.iiit.ac.in/ ugee2024/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు